హైద‌రాబాద్‌లో ఆ ప్రాంతంలోనే అమ్మాయిల అదృశ్యం… !

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో కొద్ది రోజులుగా అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారు. ముఖ్యంగా గ‌త మూడు రోజులుగా దిండిగ‌ల్ ప్రాంతంలో ముగ్గురు మ‌హిళ‌లు అదృశ్యం కావ‌డంతో ఈ ప్రాంతంలో  ఈ విష‌యం పెద్ద సంచ‌ల‌నంగా మారింది. దుండిగల్‌ లో నివాసం ఉంటున్న శిరీష్ అనే 22 ఏళ్ల యువతి,భారతి అనే 21 యువతి, ఎమ్.పద్మావతి అనే 38 ఏళ్ల మహిళ క‌నిపించ‌కుండా పోయారు. శిరీష అనే 22 ఏళ్ల యువ‌తి  ఈ నెల 19 ఇంటి నుంచి బ‌ట‌య‌కు వెళ్ల‌గా .. ఆ త‌ర్వాత ఆమె జాడ లేదు.

అదే ప్రాంతానికి చెందిన భారతి అనే 21 ఏళ్ల మరో యువతి ఓ ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఆమె కూడా ఈ నెల 20న కొంప‌ల్లిలో ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రం ఆమె ఇంటికి రాక‌పోవ‌డంతో ఆమె గురించి తెలిసిన వాళ్ల ద‌గ్గ‌ర ఆరా తీసినా ఫ‌లితం లేదు. దీంతో ఆమె తండ్రి పైడితల్లి దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇక ఎం.పద్మావతి అనే 38 ఏళ్ల గృహిణి కూడా అదృశ్యం అయ్యింది. భ‌ర్త‌తో గొడ‌వ ప‌డి ఇంటి నుంచి 21వ తేదీన బ‌య‌ట‌కు వెళ్లిన ఆమె అప్ప‌టి నుంచి ఇంటికి రాలేదు.

వ‌రుస‌గా మూడు రోజులు ముగ్గురు మ‌హిళ‌లు ఒకే  ప్రాంతంలో అదృశ్యం కావ‌డంతో అనేక సందేహాల‌కు తావిస్తోంది. గత ఏడాది రాష్ట్రంలో సగటున రోజుకు 60 మంది వరకు అదృశ్యమయ్యారని తెలుస్తోంది. గతేడాది జూన్ నెల మొదటి పది రోజుల్లోనే 545 మంది కనిపించకుండా పోయారు. పోలీస్ రికార్డుల్లో న‌మోదు కాని వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంద‌ని తెలుస్తోంది.

Leave a comment