ఏపీలో వరుసగా హిందూ దేవాలయల్లో జరుగుతోన్న సంఘటనలు అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు పెద్ద తలనొప్పిగా మారాయనే చెప్పాలి. తాజాగా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి నాని వెంకటేశ్వర స్వామిపై చేసిన వ్యాఖ్యలపై శ్రీనివాసనంద స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి వ్యాఖ్యలను గుర్తు చేసుకున్న ఆయన కంట తడి పెట్టడంతో పాటు ఆయన తక్షణమే హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నాని క్షమాపణ చెప్పకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే ఆయనతో క్షమాపణ చెప్పించాలన్నారు. ఇక నాని మాటలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని.. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
హిందువుల విషయంలో ఇంత బాధ్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు చేసే నానిపై కేసులు పెట్టాలని.. లేనిపక్షంలో ఉద్యమిస్తానన్న నాని.. హిందు ధర్మంకోసం అన్ని పార్టీల నేతలు పార్టీలతో సంబంధం లేకుండా స్పందించాలని శ్రీనివాసనంద స్వామి కోరారు.