ఆ సంఘ‌ట‌న త‌ర్వాతే చంద్ర‌బాబుపై చిరంజీవికి విర‌క్తి … పోసాని సంచ‌ల‌నం

సినిమా ఇండ‌స్ట్రీలో పోసాని కృష్ణ ముర‌ళీ సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో ఉంటున్నారు. సినిమాలు అయినా, రాజ‌కీయాలు అయినా పోసాని ముక్కుసూటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. ఇక ఆయ‌న త‌న తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి  ప్ర‌జారాజ్యం త‌ర‌పున చిల‌క‌లూరిపేట సీటు ఇచ్చేట‌ప్పుడు త‌న‌ను ఎలాంటి డ‌బ్బులు అడ‌గ‌లేద‌ని… త‌న‌ను నిజాయితీగా న‌మ్మి సీటు ఇచ్చినా తాను గెల‌వలేక‌పోయాన‌ని చెప్పారు.

 

ఆ స‌మ‌యంలో చిరంజీవి కుమార్తె ఓ వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నార‌ని.. అప్పుడు టీడీపీ మ‌హిళా నేత‌లు చిరు సొంత కూతురినే కంట్రోల్ చేయ‌లేక‌పోతే రాష్ట్రాన్ని ఎలా కంట్రోల్ చేస్తార‌ని ఎద్దేవా చేశార‌ని ట్రోల్ చేశార‌ని.. అప్పుడు చిరంజీవి చాలా అప్‌సెట్ అవ్వ‌డంతో పాటు రెండు నెల‌లు బాధ‌ప‌డ్డార‌ని పోసాని చెప్పారు. చంద్ర‌బాబు లాంటి సంస్కారి నా ప‌ర్స‌న‌ల్ జీవితంపై వారి పార్టీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తే. కనీసం వారితో క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పించ‌లేద‌ని వాపోయార‌ని పోసాని చెప్పారు.

 

ఈ సంఘ‌ట‌న త‌ర్వాతే చంద్ర‌బాబు అంటే నాకు చాలా విర‌క్తి క‌లిగింద‌ని చిరంజీవి నాతో అన్నార‌ని పోసాని వెల్లడించారు. ఈ విష‌యంలో తాను రెండు నెల‌ల పాటు ఎంతో బాధ‌ప‌డ్డాన‌ని కూడా చిరంజీవి గుర్తు చేశార‌ని పోసాని తెలిపారు.

Leave a comment