ప్రపంచానికి ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రపంచ మహమ్మారి కరోనాపై ఇప్పటికే ఎన్నో దేశాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ఇక ఇప్పటికే కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టు ప్రకటించిన రష్యా ప్రజా పంపిణీ కూడా ప్రారంభించింది. ఇప్పటికే రష్యాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే మొత్తం 40 వేల మంది వలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చి ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
అయితే ఫేజ్ 2 ట్రయల్స్ ఇప్పటికే 7 వేల మందికి నిర్వహించగా వీరిలో ప్రతి ఏడుగురిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయట. అయితే ఇవి స్వల్పంగా ఉండడంతో రష్యా కోవిడ్ వ్యాక్సిన్ దాదాపు సక్సెస్ అయినట్టే అని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో చెపుతున్నారు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న అందరిలోనూ రోగ నిరోధక శక్తి పెరగగా.. కండరాల నొప్పులు, స్వల్ప తలనొప్పి లాంటి లక్షణాలు మాత్రం కనిపించాయి.
ఇక ఫేజ్ 3 ట్రయల్స్ ఫలితాలు అక్టోబర్ లేదా నవంబర్లో వస్తాయి. ఇక ఇప్పటికే స్పుత్నిక్‌ను భారత్‌లో సరఫరా చేసేందుకు రెడ్డీస్ ల్యాబ్ ఇప్పటికే రష్యా నుంచి అనుమతి పొందింది. ఈ వ్యాక్సిన్‌పై రెడ్డీస్ సైతం భారత్‌లో ఫేజ్ 2,3 ట్రయల్స్ నిర్వహించనుంది.