Gossipsఆ ఆంటీ హీరోయిన్‌కు చ‌ర‌ణ్ కాల్‌...!

ఆ ఆంటీ హీరోయిన్‌కు చ‌ర‌ణ్ కాల్‌…!

టాలీవుడ్లోనే కాదు సౌత్ సినిమా ఇండ‌స్రీలో ముదురు ఆంటీ ర‌మ్య‌కృష్ణ‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆమె సౌత్‌లో తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ అన్ని భాష‌ల్లో స్టార్ హీరోల‌తో నటించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు కొట్టింది. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు నా అల్లుడు సినిమాలో అత్త‌గా న‌టించి మెప్పించిన ర‌మ్య… సింహాద్రి, అడ‌వి రాములు లాంటి కుర్ర హీరోల సినిమాల్లోనూ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. ఈ క్ర‌మంలోనే ఆమెను లూసీఫ‌ర్ రీమేక్‌లో నటింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

 

లూసీఫ‌ర్ రీమేక్‌కు ముందుగా సుజీత్ ద‌ర్శ‌కుడు అని టాక్ వ‌చ్చినా.. ఆ త‌ర్వాత వివి. వినాయ‌క్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ సినిమాను కూడా రామ్‌చ‌ర‌ణే స్వ‌యంగా నిర్మిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే క‌థా చ‌ర్చ‌ల్లో ఈ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌కు ర‌మ్య‌కృష్ణ అయితేనే క‌రెక్ట్ అన్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. దీంతో రామ్‌చ‌ర‌ణ్ స్వ‌యంగా రమ్య‌కృష్ణ‌కు ఫోన్ చేసి సినిమాలో న‌టించాల‌ని అడిగిన‌ట్టు తెలుస్తోంది.

 

 

ప్ర‌స్తుతం ర‌మ్య ఫుల్ బిజీ అయిపోయింది. బాహుబ‌లి త‌ర్వాత ఆమె అటు వెండితెర‌తో పాటు ఇటు బుల్లితెర‌పై కూడా న‌టిస్తోంది. ఇక వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు లూసీఫ‌ర్‌లో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌కు రెడీ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news