మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ మంచి పనిచేసి శభాష్ అనిపించుకున్నారు. ఆమె అనంతపురం జిల్లాలోని రైతులు, వ్యవసాయ కూలీల అదనపు ఉపాధి కోసం రు. 2 కోట్ల రూపాయిల విరాళం ప్రకటించారు. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వీరంతా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె రు. 2 కోట్ల విరాళాన్ని అనంతపురం యాక్షన్ ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్కు అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అనుపమ నాదెళ్లను అభినందించారు.
ఇక ఇలాంటి దాతలు ఇచ్చిన సాయంతో రైతులు, వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇక సత్య నాదెళ్ల భార్య అనుపమకు చిన్నప్పటి నుంచే సేవాభావం ఎక్కువ. ఆమె తండ్రి వేణుగోపాల్ ఐఏఎస్ అధికారి. ఆయన చాలా చోట్ల కలెక్టర్గా పనిచేశారు. అప్పుడు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పర్యటించిన అనుపమ అక్కడ సమస్యలను తెలుసుకుని తన వంతుగా పరిష్కరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏదేమైనా అనుపమ సేవా భావానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.