Moviesబిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ సాయికుమార్‌... మామూలు ర‌చ్చ కాదు

బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ సాయికుమార్‌… మామూలు ర‌చ్చ కాదు

బిగ్‌బాస్ ఫ‌స్ట్ వీక్ ముగుస్తోంది. ఈ రోజు ఫ‌స్ట్ ఎలిమినేష‌న్లో ఎవ‌రు ఉంటార‌న్న‌ది కొద్ది సేప‌ట్లో తేలిపోతుంది. ఇక ఇప్ప‌టికే వీక్ కంటెస్టెంట్ల‌తో షో చ‌ప్ప‌గా సాగుతుంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ రోజు ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంద‌ని బిగ్‌బాస్ తాజా ప్రోమోతో స‌డెన్ షాక్ ఇచ్చేశాడు. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవ‌రు ? అన్న దానిపై స‌స్పెన్స్ తొల‌గిపోయింది. ఈ ఫ‌స్ట్ వీక్ ఎలిమినేష‌న్లో ఉన్న వారిని సేవ్ చేసేందుకు ఇప్ప‌టికే 5 కోట్ల ఓట్లు వ‌చ్చాయి. వీరిలో శ‌నివారం హీరో అభిజిత్‌, జోర్దార్ సుజాత‌, గంగ‌వ్వ‌లు సేవ్ అయ్యారు. ఇక మిగిలిన వారిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో ఈ రోజు తెలుస్తుంది.

 

ఎక్కువ మంది సూర్య‌కిర‌ణ్ పేరు సూచిస్తున్నారు. ఇక హౌస్‌లోకి కొత్త కంటెస్టంట్ని తీసుకువ‌స్తున్నారు. ఈ రోజుల్లో, బస్‌స్టాప్‌, ల‌వ‌ర్స్ మూవీలో కామెడీ పాత్ర చేసిన సాయి కుమార్ పంప‌న వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. సాయికుమార్ 14 రోజులు క్వారంటైన్‌లో ఉండి నెగిటివ్ వ‌చ్చాకే ఎంట్రీ ఇస్తున్నాడ‌ట‌. మ‌రి కామెడీ షోలో ర‌చ్చ చేసే సాయికుమార్ హౌస్‌లో ఉంటే ఇంకెత ర‌చ్చ షురూ అవుతుందో ?  చూడాలి.

https://www.instagram.com/p/CFEtqZQjtKC/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news