MoviesV సినిమా రాజ‌మౌళి ఎలా చూశాడో తెలుసా...

V సినిమా రాజ‌మౌళి ఎలా చూశాడో తెలుసా…

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి మరియు ఆయన కుటుంబం అంతా క‌లిసి త‌మ స‌న్నిహితుల సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ మల్టీఫ్లెక్స్‌లో రెగ్యుల‌ర్‌గా చూస్తుంటారు. అయితే ఈ సారి క‌రోనా రాక‌తో థియేట‌ర్లు అన్ని బంద్ అయ్యాయి. దీంతో సినిమాల రిలీజ్‌కు చాలా గ్యాప్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం సినిమాలు అన్ని ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే నాని వి సినిమా నిన్న అమోజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది.

Image

రాజ‌మౌళి – నాని స‌న్నిహితంగా ఉండ‌డంతో నాని సినిమాల‌ను కూడా రాజ‌మౌళి బిగ్ స్క్రీన్ మీద త‌న ఫ్యామిలీతో క‌లిసి చూస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు థియేట‌ర్లు లేక‌పోవ‌డంతో రాజ‌మౌళి త‌న ఫామ్‌హౌస్‌లో వి సినిమాను ఫ్యామిలీతో క‌లిసి ప్రైవేట్ స్క్రీనింగ్ మీద చూస్తుంటారు. రాజ‌మౌళి కుటుంబంతో పాటు కీర‌వాణి కుటుంబం కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఈ స్క్రీనింగ్ ఫొటోల‌ను కార్తీకేయ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి వి సినిమా యూనిట్‌కు విషెస్ తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news