Gossipsసీనియ‌ర్ హీరోయిన్‌తో సాంగేసుకుంటోన్న బాల‌య్య‌

సీనియ‌ర్ హీరోయిన్‌తో సాంగేసుకుంటోన్న బాల‌య్య‌

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బీబీ 3 సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. దీంతో మ‌రోసారి వీరి కాంబోలో వ‌స్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్లో న‌టించ‌నున్నాడు. రెండో హీరో పాత్ర‌కు అంజ‌లి లేదా కొత్త హీరోయిన్‌ను తీసుకోవాల‌ని అనుకుంటున్నారు.

బాలకృష్ణ సినిమాలో నిన్నటితరం హీరోయిన్ ..

ఇక సీనియ‌ర్ బాల‌య్య ప‌క్క‌న చాలా మంది హీరోయిన్ల పేర్లు ప‌రిశీలించినా చివ‌ర‌కు సీనియ‌ర్ హీరోయిన్ మీనాను ఫైన‌లైజ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. గతంలో బాల‌య్య – మీనా కాంబోలో కూడా కొన్ని సినిమాలు వ‌చ్చాయి. ఇక ఈ సినిమాలో బోయ‌పాటి బాలయ్య – మీనాల మధ్య ఫ్యామిలీ సాంగ్ కూడా సెట్ చేశార‌ట‌. ఇక కొద్ది రోజుల క్రింద‌టే వ‌చ్చిన టీజ‌ర్లో బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్, దుమ్ము రేపే యాక్షన్ మామూలుగా లేదు. పంచెకట్టులో బాల‌య్య డైలాగ్ అదిరిపోయింది. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news