టాలీవుడ్లో మురళీ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీరియస్ విలన్‌గా, కమెడియన్ విలన్‌గా, కమెడియన్‌గా ఇలా అనేక పాత్రల్లో మురళీశర్మ తెలుగు ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్నాడు. తెలుగులు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిథి సినిమాలో విలన్‌గా నటించిన మురళీ శర్మ ఆ తర్వాత విలన్‌గా, హీరోలకు, హీరోయిన్లకు తండ్రిగా మంచి పాత్రల ద్వారా ఇక్కడ ప్రేక్షకుల మనస్సులను గెలుచుకన్నారు. భలే భలే మగాడివోయ్ సినిమాలో లావణ్య త్రిపాఠి తండ్రిగా ఆయన నటన అద్భుతం అనే చెప్పాలి.
ఇక అల వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ తండ్రిగా ఎంతలా శాడిజం చూపించాడో, ఎంత కన్నింగ్ఫెలోగా నటించాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మురళీశర్మ భార్య ఎవరో తెలుసా.. ఆమె మన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆమె పేరు అశ్విని కులశేఖర్. బాలీవుడ్ టాప్ నటీమణి అయిన ఆమె అక్కడ పలు ఫేమస్ సీరియల్స్‌లో నటించింది. ఆమె తెలుగులో బద్రినాథ్ సినిమాలో లేడీ విలన్‌గా నటించి.. (తమన్నాకు అత్తగా) మెప్పించింది.