Moviesప‌వ‌న్ సినిమాలో న‌టిస్తున్నా... గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్‌

ప‌వ‌న్ సినిమాలో న‌టిస్తున్నా… గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులు ఓకే చెప్పుకుంటూ పోతున్నాడు. ఓ వైపు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న వ‌కీల్‌సాబ్‌, ఆ వెంట‌నే క్రిష్ సినిమా, ఆ వెంట‌నే సురేంద‌ర్‌రెడ్డితో ఓ ప్రాజెక్టు, హ‌రీష్ శంక‌ర్‌తో మ‌రో ప్రాజెక్టు లైన్లో పెట్టేశాడు. ఇక మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తోనూ ఓ సినిమా ఉండ‌నుంది. ఓవ‌రాల్‌గా చూస్తే మ‌రో నాలుగేళ్ల పాటు ప‌వ‌న్‌కు క్ష‌ణం తీరిక లేని ప‌రిస్థితి ఉంది. ఇక ప‌వ‌న్ న‌టిస్తోన్న తాజా చిత్రం వ‌కీల్‌సాబ్ విష‌యానికి వ‌స్తే ఈ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ పింక్‌కు రీమేక్‌గా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

Niveda Thomas Biography, Age, Height, Body, Bio data & Untold Stories -  WikiBioPic

ఈ సినిమాలో ప‌వ‌న్‌తో పాటు హీరోయిన్లుగా నివేదా థామ‌స్‌, అంజ‌లి న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నా వారి లుక్స్‌, స్టిల్స్ ఇప్ప‌టి వ‌ర‌కు రివీల్ కాలేదు. తాజాగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసిన నివేద వ‌కీల్‌సాబ్ గురించి ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ ఇచ్చింది. తాను వ‌కీల్‌సాబ్ సినిమాలో న‌టిస్తున్నాన‌ని.. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింద‌ని చెప్పిన ఆమె సినిమా సూప‌ర్‌గా ఉంటుంద‌ని చెప్పింది. నివేద వ‌కీల్‌సాబ్ గురించి క్లారిటీ ఇవ్వ‌డంతో పాటు సినిమా సూప‌ర్ అని చెప్ప‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆనందానికి అంతే లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news