నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన 25 ఏళ్ల యువతిపై 139 మంది అత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలికి అండగా నిలిచిన మందకృష్ణ మాదిగ తాజాగా సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. డాలర్ బాబు అనే వ్యక్తి బలవంతం చేయడం వల్లే బాధితురాలు ప్రదీప్‌పై కేసు పెట్టిందని ఆయన చెప్పారు.
గతంలో పూలన్‌దేవి అనేకమంది చేతిలో అఘాయిత్యానికి గురయ్యారని.. ఇప్పుడు ఈ కేసు చూస్తుంటే కూడా అదే ఘటన తనకు గుర్తు వస్తుందని మంద కృష్ణ తెలిపారు. ఇక ఓ మహిళా ఏసీపీ ఈ కేసును విచారిస్తోందని.. ఈ కేసును తాము సీఐడీకి బదిలి చేయాలని కోరుతున్నాం అని ఆయన తెలిపారు. ఆ అమ్మాయితో సుదీర్ఘంగా తాను మాట్లాడానని ఆయన చెప్పారు. మొత్తం ఆమె కేసు పెట్టిన 139 మంది లో 30 శాతం మంది అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేశారు. ఇంకో 30 శాతం అమ్మాయిని మానసికంగా వేదించి బ్లాక్ మెయిల్ చేశారు. ఇక మరో 40 శాతం మందికి ఈ అమ్మాయితో సంబంధం లేదని కృష్ణ తెలిపారు.
ఇక ఆమె చిన్న వయస్సులోనే బ్లాక్ మెయిల్ రేప్‌కు గురైందని.. ఆమె జీవితంలోకి ఎస్‌ఎఫ్‌ఐ మీసాల సుమన్ ప్పుడైతే ప్రవేశించాడో అప్పుడే అమ్మాయి బ్లాక్ మెయిల్‌కు గురైంది. డాలర్ బాబు అమ్మాయితో కేసులు పెట్టించి వారిని బ్లాక్‌మెయిల్ చేశాడు. డాలర్ బాబు కూడా అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడడని మందకృష్ణ తెలిపారు. మొత్తానికి ఈ కేసుకు ప్రదీప్‌కు లింక్ లేదని తేలిపోయింది.