రాజమౌళితో సినిమా అంటే ఓ పట్టాన తెమలదు. ఎన్ని రోజులు పడుతుందో ? కూడా చెప్పలేం. సినిమాను చెక్కిన చోటే చెక్కుతూ చాలా టైం తీసుకుంటాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్‌ను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో ? కూడా తెలియదు. ఇక ఇప్పుడు రాజమౌళి వల్ల చాలా మంది లాక్ అయిపోయారన్న టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. రామ్‌చరణ్, కొరటాల, త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఇలా మందిని ఇప్పుడు రాజమౌళి పరోక్షంగా లాక్ చేసినట్లయ్యింది.
ఈ లాక్ వల్ల వందల కోట్ల బిజినెస్ అలాగే నిలిచిపోయింది. ఎలా లేదన్నా ఆర్ ఆర్ ఆర్ మరో ఎనిమిది నెలలు పడుతుందని అంటున్నారు. అప్పటి వరకు చరణ్, ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్టులు ముందుకు కదలవు. ఇక ఎన్టీఆర్ కోసం వెయిట్ చేసే త్రివిక్రమ్ అలాగే ఎదురు చూడాలి. ఇక చరణ్ ఆచార్యలో చేయాలి.. రాజమౌళి చరణ్‌ను వదిలితే కాని కొరటాల ఆచార్యను ముందుకు కదపలేడు. సో ఈ లెక్కన రాజమౌళి నిర్ణయం మీదే ఇప్పుడు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా, ఆచార్య ఆధారపడి ఉన్నాయి.
అయితే మరో టాక్ ప్రకారం ఆచార్యకు డేట్లు ఇవ్వవచ్చని చరణ్‌కు, త్రివిక్రమ్ సినిమాకు డేట్లు ఇవ్వవచ్చని తారక్‌కు సూచించినట్టు కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఆర్ ఆర్ ఆర్‌తో ఇద్దరు స్టార్ హీరోలను రెండేళ్లుగా లాక్ చేసిన జక్కన్న చాలా బిజినెస్‌కు బ్రేక్ వేశాడనే చెప్పాలి.