Gossipsబాల‌య్య - బోయ‌పాటి మూవీకి ప్లాప్ టైటిలా...!

బాల‌య్య – బోయ‌పాటి మూవీకి ప్లాప్ టైటిలా…!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శీను కాంబినేష‌న్లో ఇప్ప‌టికే వ‌చ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక తాజాగా వీరి కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి వ‌స్తోన్న సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. బీబీ 3 ఇది ఇప్ప‌టికే వైర‌ల్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్లో బాల‌య్య చెప్పిన డైలాగ్ దుమ్ము రేపేసింది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు రెండు మూడు టైటిల్స్ వినిపించాయి. ముందు మోనార్క్ టైటిల్ వినిపించింది. ఇక ఇప్పుడు డేంజ‌ర్ టైటిల్ రేసులో ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆల్రెడీ డేంజర్ టైటిల్ తో కృష్ణవంశీ సినిమా చేశాడు. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన డేంజ‌ర్ సినిమా స‌రిగా ఆడ‌లేదు. క‌ల‌ర్స్ స్వాతి ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ఈ సినిమా యూత్ ఆడియెన్స్‌ను మెప్పించ‌డంలో ఫెయిల్ అయ్యింది.

ఇక ఇప్పుడు బాల‌య్య – బోయ‌పాటి సైతం ఇదే టైటిల్‌తో వస్తే అంత ఇంప్రెస్ ఉండదేమో అని.. వీరి రేంజ్‌కు త‌గిన టైటిల్‌తో సినిమా  రిలీజ్‌కు ముందే మంచి అంచ‌నాలు పెంచాల‌ని నంద‌మూరి అభిమానులు కోరుతున్నారు. సింహా, లెజెండ్ చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటాయి. ఇక ఇప్పుడు బీబీ 3 టైటిల్ సైతం అదే రేంజ్లో ఉంద‌ని అంటున్నారు. ఇక ఈ సినిమాలో అంజలి, స్నేహ హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news