ప్రస్తుతం ప్రపంచాన్ని నెట్ విప్లవం ఎలా శాసిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు 2జీ స్పీడ్ చూసే మహాప్రసాదం అనుకున్నారు. ఆ తర్వాత 3జీ నెట్ ఎంట్రీతో నెట్ విప్లవంలో ఓ సరికొత్త శకం అయితే ప్రారంభమైంది. ఇక 4జీ నెట్ రావడమే ఓ సంచలనం అయితే.. మనదేశంలో జియో 4జీ నెట్ దేశగతిని మార్చేసింది. 4జీ నెట్ వచ్చాక ఎంతో మంది నెట్‌మీదే ఆధారపడి బతికేవాళ్లు ఎక్కువయ్యారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సైతం 4జీ నెట్ సేవలు విస్తరిస్తున్నారు.
ఇక ఈ నెట్ విప్లవంలో ఇప్పటి వరకు ఉన్న హయ్యాస్ట్ నెట్ స్పీడ్ బ్రేక్ అయ్యింది. ఈ రికార్డును లండన్ లోని రాయల్ అకాడమీ బ్రేక్ చేసింది. డాక్టర్ లిడియో గాల్డినో టీం ఈ రికార్డును సాధించే దిశగా పరీక్షలు చేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న 44.2 టీబీపీఎస్ స్పీడ్ రికార్డు ఆస్ట్రేలియా పేరు మీద ఉంది. ఇక ఇప్పుడు లండన్‌లో రాయల్ అకాడమీ టీం చేసిన పరిక్ష నెట్ స్పీడ్ 178 టీవీ. దీనిని జీబీల్లో చూస్తే సెకనుకు 178000 జీబీ. ఈ స్పీడ్‌తో కేవలం ఒక్క సెకన్‌లో 1500 సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెపుతున్నారు.
ఓ వైపు చైనా 5జీ టెక్నాలజీలో దూసుకు వెళుతోన్న వేళ లండన్‌లో జరిగిన ఈ ప్రయోగం నెట్ విప్లవాన్ని మరో దశకు తీసుకు వెళ్లనుంది. అయితే ఈ వేగం సాధించాలంటే సాధారణ కేబుల్స్‌కు బదులుగా ఫైబర్ ఆక్టిక్ కేబుల్స్ వాడాల్సి ఉంటుంది. ఇక మనదేశంలో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ వేగం 2ఎంబీపీఎస్ అన్న విషయం తెలిసిందే.