Newsహైద‌రాబాద్‌లో యువ‌తులు దారుణం.. రోడ్డుపై మందేసి అబ్బాయి బ‌ట్ట‌లిప్పేసి

హైద‌రాబాద్‌లో యువ‌తులు దారుణం.. రోడ్డుపై మందేసి అబ్బాయి బ‌ట్ట‌లిప్పేసి

స‌మాజంలో రోజు రోజ‌కు అమ్మాయిలు మ‌రీ బ‌రి తెగించేస్తున్నారు. సాధార‌ణంగా మ‌నం రోడ్డుపైన వెళుతోన్న మ‌హిళ‌ల‌ను వేధించ‌డం అన్న మాట‌లు వింటుంటాం. కానీ హైద‌రాబాద్‌లో ఇందుకు రివ‌ర్స్‌లో జ‌రిగింది. తాజాగా హైద‌రాబాద్‌లో న‌లుగురు యువ‌తులు ఫుల్లుగా మందేసి రోడ్డుపైనే డ్యాన్సులు చేశారు. అక్క‌డితో ఆగ‌కుండా రోడ్డుపై వెళుతోన్న వారిని కొట్ట‌డంతో పాటు వారిలో కొంద‌రి ద‌గ్గ‌ర డ‌బ్బులు కూడా లాగేసుకున్నారు. రోడ్డుపైనే మందుకొట్ట‌డంతో పాటు తూలుతూ అక్క‌డ వెళుతోన్న వారిని నానా టార్చ‌ర్ పెట్టారు.

ఓ యువ‌కుడు క‌నిపిస్తే ఆ యువ‌కుడి బట్టలు విప్పి వికృతంగా ప్రవర్తించారు. యువతులు బ‌రి తెగింపు విష‌యం ఇప్పుడు న‌గ‌రంలోనే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. చైత‌న్య‌పురి కనకదుర్గ వైన్స్ దగ్గర ఉన్న బస్టాప్ లో శనివారం రాత్రి నలుగురు యువతులు హల్ చల్ చేశారు. వీరు మందు వేసి వైట్‌న‌ర్ పీల్చుతూ రోడ్డుపై వెళుతోన్న వారితో కావాల‌నే గొడ‌వ‌కు దిగారు.

ఇక ఓ యువ‌కుడు బ‌స్టాప్‌లో ప‌డుకుని ఉంటే అత‌డి బ‌ట్ట‌లు విప్పేసి నీచంగా ప్ర‌వ‌ర్తించారు. యువ‌తులు బ‌హిరంగ ప్ర‌దేశంతో ఇంత బ‌రితెగించ‌డంతో రోడ్డుపై వెళుతోన్న కొంద‌రు ఆ దృశ్యాలు చూసి క‌లికాలం అంటే ఏంటో అనుకున్నాం.. ఇంత దారుణ‌మా ? అని షాక్ అవుతున్నారు. ఇంత జ‌రుగుతున్నా పోలీసులు మాత్రం అటు వైపు తొంగి చూసేందుకు కూడా సాహ‌సించ‌లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news