ప్రేమిస్తున్నానని ఓ మైనర్ బాలికను లోబరుచుకున్న ఓ రాజకీయ నేత కొడుకు రోహన్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత కొడుకుకు ఇటీవల జరిగిన బోనాల ఉత్సవాల్లో ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను ఓ రోజు ఇంటికి పిలిపించుకుని ఆమెకు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి ఆ బాలికను లోబరుచుకుని ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికి అయినా చెపితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె ఎవ్వరికి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయింది. చివరకు ఈ విషయం ఇటీవల బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో వారు కుల్సుంపురా పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలిసిన రోహన్ కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తానని మరోసారి బెదిరించాడు. దీంతో రోహన్‌తో మరోసారి ప్రాణహానీ ఉందని ఆ బాలిక తల్లిదండ్రులు మళ్లీ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.