నిన్నటి తరం అందాల రాశి.. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్. తన కుమార్తెను స్టార్ హీరోయిన్‌గా చేయాలని శ్రీదేవి ఎన్నో కలలు కన్నారు. అయితే జాన్వీ తొలి సినిమా కూడా రిలీజ్ కాకుండానే శ్రీదేవి మృతి చెందారు. ఆ తర్వాత శ్రీదేవి కుమార్తె జాహ్నవి తొలి సినిమా ధడక్ రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు రెండో సినిమా కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కింది. అయితే దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో కరుణ్ జోహార్‌కు సైతం యాంటీగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఈ సినిమా బలైపోయిందన్న టాక్ వస్తోంది.
గుంజన్ సక్సేనా జీవితం ద్వారా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ ప్లాట్ పామ్ ద్వారా రిలీజ్ అయ్యింది. అయితే సుశాంత్ సింగ్ ఎఫెక్ట్ సినిమాపై భారీగా పడడంతో పాటు నెగిటివ్ ప్రచారం ఎక్కువుగా జరుగుతుండడంతో సినిమాకు వ్యూయర్ షిఫ్ ఘోరంగా పడిపోయింది. పైగా జాహ్నవీ కపూర్ నటన కూడా బాగోలేదని అంటున్నారు. దీంతో గుంజన్ సక్సేనా మూవీ మైనస్‌లో పడిపోయింది. సక్సెస్ ఫుల్ ఫైలెట్, కార్గిల్ పోరాటయోధురాలు అయిన గుంజన్ సక్సేనా జీవితంలో అసలు ఘట్టాలు వదిలేసి కల్పితాలు ఎక్కువ చేసేశారని కూడా విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే వాయసేసే కూడా కేంద్ర సెన్సార్ బోర్డుకు లేఖ రాసినట్టు చెపుతున్నారు. ఏదేమైనా జాన్వీ కపూర్‌కు తొలి సినిమా బ్లాక్ బస్టర్ కాలేదు.. రెండో సినిమా విషయంలో అనుకుందొకటి… అయ్యిందొకటి అన్నట్టుగా ఉంది. జాన్వీ ఆశలు అన్నీ అడియాసలే అయ్యాయి. ఏదేమైనా సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత ఆరోపణల నేపథ్యంలో ఓ సెక్షన్ అంతా కరణ్ జోహార్‌కు వ్యతిరేకమైంది. ఈ క్రమంలోనే ఆ ఎఫెక్ట్ జాన్వీ సినిమాపై పడిపోయింది.