Gossipsరాధేశ్యామ్‌కు అదే మైన‌స్ అవుతోందా... రిజ‌ల్ట్ ఎక్క‌డో తేడా కొడుతోందా...!

రాధేశ్యామ్‌కు అదే మైన‌స్ అవుతోందా… రిజ‌ల్ట్ ఎక్క‌డో తేడా కొడుతోందా…!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో సినిమా త‌ర్వాత రాధేశ్యామ్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. జిల్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌. పీరియాడిక‌ల్ స్టోరీగా ల‌వ్ + యాక్ష‌న్ అంశాల‌తో తెర‌కెక్కే ఈ సినిమాను యూవీ క్రియేష‌న్స్‌తో పాటు ప్ర‌భాస్ సొంత బ్యాన‌ర్ అయిన గోపీకృష్ణా మూవీస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం యూర‌ప్‌లో జ‌రిగిన ఓ య‌దార్థ ప్రేమ‌క‌థ‌కు కొన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాలు జోడీంచి ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నాడ‌ని టాక్‌.

 

ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు ఉన్నాయి. రాధేశ్యామ్‌కు సంబంధించి కొన్ని అనుమానాలు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ల‌వ్‌, యాక్ష‌న్ స్టోరీగా తెర‌కెక్కిన రాధేశ్యామ్‌లో కామెడీ త‌క్కువుగా ఉంద‌ని.. ఇది రిజ‌ల్ట్‌పైన ప్ర‌భావం చూపుతుందా ? అన్న డౌట్లు కొంద‌రు రైజ్ చేస్తున్నారు. ఫ‌స్టాఫ్‌లో రొమాంటిక్ సీన్ల‌తో పాటు మంచి పాట‌లు ప్రియ‌ద‌ర్శి వంటి క‌మెడియ‌న్ల‌తో మంచి సీన్లు రాసుకున్న ద‌ర్శ‌కుడు సెకండాఫ్‌లో ఎక్కువుగా యాక్ష‌న్ పార్డుకే ప్ర‌యార్టీ ఇచ్చాడ‌ని అంటున్నారు. ల‌వ్‌, యాక్ష‌న్ నేప‌థ్యంలో ఎక్కువుగా సినిమాను న‌డిపించిన ద‌ర్శ‌కుడు కామెడీకి స్కోప్ త‌గ్గించ‌డం మ‌న‌స్సే అంటున్నారు.

 

మ‌రి త‌క్కువ కామెడీ ఉన్నా రాధేశ్యామ్ రొమాంటిక్ ట్రాక్‌, యాక్ష‌న్ పార్టుతో మెప్పిస్తుందా ? అన్న‌ది చూడాలి. ఈ సినిమాలో ప్రేమ‌పావురాలు న‌టి భాగ్య శ్రీ, కృష్ణంరాజు, ప్రియదర్శి, షాషా ఛత్రి, కునాల్ రాయ్ కపూర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వ‌చ్చే యేడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news