సాహో సినిమా విడుదలై వారం రోజులు అవుతుంది. ఈ సినిమా డివైడ్ టాక్‌తో థియోటర్లలో రన్ అవుతున్న మాట వాస్తవమే. సాహో సినిమా ప్రెంచ్ సినిమా లార్గోవించ్ ను కాపీ కొట్టాడనే పుకార్లు షికారు చేస్తున్నాయి. షికారు చేయడమే కాదు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి రూపంలో కాపీ కొట్టడం అందిరికి దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే వీటికి చెక్ పెట్టెందుకు స్పందించాడు దర్శకుడు సుజిత్.
సాహో సినిమా లార్గోవించ్ సినిమా ను చూసి కాపీ కొట్టాడనే విమర్శ తప్పు అంటున్నాడు దర్శకుడు సుజిత్. అసలు లార్గోవించ్ సినిమాను నన్ను విమర్శించేవారు పూర్తిగా చూసి ఉండరు. లార్గోవించ్ సినిమా పూర్తిగా చూస్తే సాహో సినిమా కాపీ సినిమానా కాదా అని తెలిసేది. అసలు ఒరిజినల్ వెర్షన్ లార్గోవించ్ సినిమా కాన్సెప్ట్‌తో బోలెడన్నీ సినిమాలు వచ్చాయని అంటున్నాడు సుజిత్. అసలు లార్గోవించ్ కాపీ కొట్టామని విమర్శించేవాళ్ళను రెండు సినిమాల స్క్రీన్‌ప్లేలో ఏమైనా సారూప్యత ఉందా అని ప్రశ్నించాడు సుజిత్.
సాహో సినిమా వాస్తవానికి లెంత్ ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే. అయితే థియోటర్లకు వచ్చిన తరువాత సినిమాను మాడిషికేషన్స్ చేయమని అనేక మంది సలహా ఇచ్చారు. కానీ థియోటర్లకు వచ్చిన తరువాత సినిమాను మార్పులు చేర్పులు చేస్తే సినిమా బాగా లేదని ఒప్పుకున్నట్లే కదా.. అని సుజిత్ ఎదురు ప్రశ్నించారు..సో సుజిత్ మాటల్లోనే వాస్తవం లేకపోలేదు.. ఎందుకంటే సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమాను కేవలం పాతికేళ్ళ వయస్సులో డీల్ చేయడం అంటే మాటలు కాదు.. అయితే కొందరు పెద్ద దర్శకులు, సిని పరిశ్రమ పెద్దలు ఈ కుర్రోడిని ఇప్పుడే అడ్డుకుంటే బాగుంటుందనే కుట్ర కోణంతో విమర్శలు కురిపిస్తున్నారో ఏమో…