బ‌న్నీ క‌థ లీకైందిగా…!!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. మాట‌ల‌తో కోట‌లు క‌డుతాడు.. కాదు కాదు మాట‌ల‌తో సినిమాలు నిర్మిస్తాడు.. మాట‌ల‌తో గార‌డి చేసే ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు మ‌రోమారు త‌న‌మాట‌ల‌తోనే ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్థుల‌ను చేసేందుకు రెడి అయ్యాడు.. అందుకు త‌గిన‌ట్లుగా క‌థ‌ను వండివార్చి వ‌డ్డించ‌బోతున్నాడు.. ఇంత‌కు మాట‌ల‌తో గార‌డి చేసే ఈ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఇప్పుడు బ‌న్నీ ఉర‌ప్ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే..

బ‌న్నీ న‌టిస్తున్న అలా వైకుంఠ‌పురంలో… ఈ సినిమాలో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ చేయ‌బోయే మాయ ఏంటో తెలుసా… అస‌లు సినిమా క‌థ ఏంటో ముందుగానే తెలుసుకోవాల‌ని ఉందా.. అయితే ఈ క‌థ‌ను ఎవ‌రో లీక్ చేశారు.. ఓసారి మ‌నం చూద్దాం… ఒక పేద కుటుంబం, ఒక ధ‌న‌వంతుల కుటుంబం ఇలా రెండు కుటుంబాలు స్నేహంగా ఉండేవ‌ట‌.. అయితే ఈరెండు కుటుంబాల మ‌ధ్య విభేదాలు రావ‌డం జ‌రుగుతుంద‌ట‌..

ఇలా విభేదాలు వ‌చ్చిన ఈ రెండు కుటుంబాల తండ్రులు త‌మ కొడుకుల‌ను పుట్ట‌గానే మార్చుకుంటార‌ట‌.. ఇలా ధ‌న‌వంతుడిగా పుట్టినవాడు అల్లు అర్జున్‌. పేదవాడిగా పుట్టిన‌వాడు సుషాంత్‌. ఇలా ఇద్ద‌రు చిన్న‌ప్పుడే మార్చ‌బ‌డుతారు క‌నుక అల్లు అర్జున్ పేద‌వాడిగా, సుషాంత్ ధ‌న‌వంతుడిగా పెరుగుతారు.. ఇలా వారు ఎలా పెరిగారు.. ఎలా మారారు.. ఈ వేరు ప‌డిన కుటుంబాల‌ను ఎలా క‌లిపారు.. అనేది సినిమా క‌థ‌.. క‌థ పాతదానిలాగే ఉన్నా.. మాట‌ల మాంత్రికుడు తీయ‌బోయే లైన్ కొత్త‌గా ఉంటుంద‌ట‌… సో అలా వైకుంఠ‌పురంలో… విహ‌రించామ‌న్న‌మాట‌…

Leave a comment