Moviesజ్యోతిక ' ఝాన్సి' రివ్యూ & రేటింగ్

జ్యోతిక ‘ ఝాన్సి’ రివ్యూ & రేటింగ్

చంద్రముఖి సినిమాలో జ్యోతిక గుర్తుంది కదా.. అంత త్వరగా మర్చిపోయే నటి కాదు ఆమె. తెలుగులో మాస్, ఠాగూర్ లాంటి సినిమాలు చేసిన జ్యోతిక తెలుగులో కన్నా తమిళంలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి హీరో సూర్యని ప్రేమించి పెళ్లాడింది. చాలా రోజుల తర్వాత జ్యోతిక లీడ్ రోల్ లో వచ్చిన సినిమా ఝాన్సి. తమిళంలో నాచియార్ గా రిలీజ్ అయ్యి హిట్ అయిన ఆ సినిమా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

కథ :

జివి ప్రకాశ్, ఇవానా ప్రేమలో పడతారు. అయితే వారి జీవితంలో అనుకోని సంఘటన వారిని రిస్క్ లో పడేస్తుంది. అలాంటి టైంలో సీనియర్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఝాన్సి (జ్యోతిక) వారి సమస్యను ఎల పరిష్కరించింది. ఈ క్రమంలో తన ముందుకు వచ్చిన ఓ మిస్టరీని ఎలా కనిపెట్టింది అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

సినిమా మొత్తం జ్యోతిక తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. హీరోయిన్ గా చేయడం వేరు.. ఇలాంటి సినిమాల్లో నటించడం వేరు. ఝాన్సిగా జ్యోతిక అదరగొట్టింది. సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా జ్యోతిక బాగా చేసింది. జివి ప్రకాశ్ తన రోల్ లో తాను అలరించాడు. ఇవానా కూడా అలరించింది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

బాలా సినిమా అనగానే రెగ్యులర్ సినిమాలకు చాలా భిన్నంగా ఉంటాయని తెలిసిందే. ఆర్టిస్టుల దగ్గర నుండి సహజ నటన తీసుకోవడంలో బాలా లెక్క వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో సినిమాలో తన మార్క్ బాగా కనిపిస్తుంది. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. సతిష్, ఈశ్వర్ సూర్య కెమెరా వర్క్ బాగుంది. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. 100 నిమిషాలే కలిగిన ఈ సినిమా బాలా కమిట్మెంట్ ఏంటో తెలియచేస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

జ్యోతికను హీరోయిన్ గా చూసిన తెలుగు ప్రేక్షకులు.. ఇలాంటి పవర్ ఫుల్ రోల్ లో కనిపించడం ఆశ్చర్యంగానే ఉంటుంది. సినిమా అంతా ఆమె మీదే నడుస్తుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా జ్యోతిక వన్ మేన్ షో చేసింది. కథ కథనాలు చాలా గ్రిప్పింగ్ గా ఉన్నాయి. సినిమా అంతా సస్పెన్స్ తో నడిపించాడు దర్శకుడు బాలా.

బాలా శివపుత్రుడుకి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. బాలా సినిమాలను మెచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చేస్తుంది. సినిమాలో ప్రతిది డీటైల్డ్ గా చూపించారు. కథ రొటీన్ గా అనిపించినా కథనం అలరిస్తుంది. ముఖ్యంగా సినిమా మొత్తం 100 నిమిషాలే ఉండటం ప్లస్ పాయింట్.

అనుకున్న కథను అనుకున్న విధంగా ప్రెజెంట్ చేశారు. అయితే తమిళ వాసన బాగా ఎక్కువయ్యింది. సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. అయితే ప్రమోషన్స్ సరిగా లేవు.. ఏదో సినిమా వచ్చింది చూసేద్దాం అనుకున్న వారికి ఓకే అనిపిస్తుంది. తెలుగులో ఝాన్సిగా జ్యోతిక ప్రయత్నం మెప్పించేలా ఉన్నా పెద్దగా లాభం వచ్చేలా ఉండదని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

జ్యోతిక

స్క్రీన్ ప్లే

సినిమాటోగ్రఫీ

రన్ టైం

మైనస్ పాయింట్స్ :

తమిళ సినిమా ఫ్లేవర్ ఎక్కువవడం

రొటీన్ స్టోరీ

బాటం లైన్ :

జ్యోతిక ఝాన్సి.. మెప్పించే ప్రయత్నమే కాని వర్క్ అవుట్ కాలేదు..!

రేటింగ్ : 2.25/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news