తారక్ దెబ్బకు కాంప్రమైజ్ అయిన త్రివిక్రమ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ‘అరవింద సమేత’ అప్పుడే ఊచకోత మొదలుపెట్టింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మొదలుకొని తాజా టీజర్ వరకు రికార్డు స్థాయిలో రెస్పాన్స్ రాబట్టుకుని తారక్ సత్తా ఏమిటో చూపించాయి. ఇక ఈ సినిమా టీజర్ చూస్తే ఇదొక పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని అర్ధం అవుతుంది. నిజానికి త్రివిక్రమ్ తారక్ కోసం ఈ స్క్రిప్ట్ రాయలేదట.

అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ తరువాత మరోసారి రొటీన్ ఎంటర్‌టైనర్‌తోనే తారక్ వద్దకు వచ్చాడట త్రివిక్రమ్. అయితే స్క్రిప్టులో రొటీన్ ఎలిమెంట్స్‌కు బదులుగా పూర్తి మాస్ యాక్షన్ అంశాలను జోడించి స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడు తారక్. ఇక చేసేది ఏమీలేక త్రివిక్రమ్ తారక్ చెప్పినట్లుగా స్క్రిప్ట్‌ను తయారు చేశాడు. దీనికోసం ఆయనకు నాలుగు నెలల సమయం పట్టిందట. కాగా షూటింగ్ స్పాట్‌లో కూడా తారక్ తనకు నచ్చిన విధంగా ఈ స్క్రిప్టులో చిన్నచిన్న మార్పులు చేస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రెడీ చేయడానికి తారక్ కష్టపడుతున్నాడు.

వరుసగా క్లాస్ సబ్జెక్ట్స్‌తో వచ్చిన తారక్ ఇప్పుడు పూర్తిగా మాస్‌లోకి మారిపోయాడు. ఈ చిత్రంతో మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్‌ ఇవ్వాలని చూస్తున్నాడు తారక్. ఏదేమైనా తారక్ స్ట్రాటజీ ముందు త్రివిక్రమ్ కాంప్రమైజ్ కాక తప్పలేదు. దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్.

Leave a comment