రికార్డులకు అమ్మ మొగుడిగా మారిన వీర రాఘవ.. ఎన్టీఆర్ టీజర్ కు యూట్యూబ్ షేక్..!

త్రివిక్రం డైరక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ సూర్యదేవర నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆగష్టు 15న ఉదయం 9 గంటలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా ఇంకా సంచలనాలు సృష్టిస్తూనే ఉంది.
3

24 గంటల్లో 6 మిలియన్స్ వ్యూయర్స్ తో రికార్డ్ సృష్టించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా రెండు రోజుల్లో 90 లక్షల వ్యూయర్స్ దాటేసి యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాడు. 9 మిలియన్ వ్యూస్ అది కూడా టీజర్ కే.. ఇక ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ హంగామా ఏంటో ఈ టీజర్ ప్రూవ్ చేసింది.
2
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ అయ్యేలా షూటింగ్ జరుపుతున్నారు. దసరా బరిలో దమ్ము చూపించేందుకు వస్తున్న ఎన్.టి.ఆర్ ఈసారి మళ్లీ రికార్డులను తిరగరాయడం ఖాయమని ఫిక్స్ అయ్యారు నందమూరి అభిమానులు.
1

Leave a comment