ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ పై ఎలాంటి పిచ్చి పిచ్చి వార్తలు వైరల్ అవుతున్నాయో బాగా బాగా మనం గమనిస్తూనే ఉన్నాం . కాగా ఈ మధ్యకాలంలో అలా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వార్తల్లో ఎక్కువగా మనం హీరోయిన్ సమంత పేరునే గమనిస్తున్నాం . కాగా రీసెంట్ గా హీరోయిన్ సమంత ఒక ట్రీట్మెంట్ ని బాగా ప్రమోట్ చేసింది.
మనకు తెలిసిందే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత.. ఆ తర్వాత హెల్త్ పట్ల చాలా చాలా కాన్షియస్ గా ఉంటుంది . ఎలా అంటే తన బాడీ కంట్రోల్ లో ఉండడానికి తన బాడీలో ..బ్లడ్ బాగా సర్కులేట్ అవ్వడానికి.. మజిల్స్ బాగా స్ట్రాంగ్ అవ్వడానికి .. రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటుంది . దానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తుంది . యోగ కూడా చేస్తూ ఉంటుంది .
తాజాగా సమంత ఒక స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకుంది . దానికి సంబంధించి ఫొటోస్ కూడా షేర్ చేసింది . ఇన్ఫ్రా రేడ్ ఆవిరి బాత్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే అంటూ సమంత కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది. రక్తప్రసరణ పెరగడం.. మెటబాలిజం పెరగడం ..మజిల్స్ పెరగడం లాంటి ఆరోగ్య ప్రయోజనాలను అన్ని కూడా సమంత పేర్కొంది. అయితే ఆ ఫోటోలో సమంత కేవలం టవల్ మాత్రమే కట్టుకొని ఉంది . కానీ కొందరు ఆ ఫొటోస్ ని మార్ఫ్ చేస్తూ సమంత పిచ్చి ఫొటోస్ ట్రోల్ చేస్తున్నారు. దీంతో సమంత ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు . ఆఖరికి ఇలాంటి విషయంలో కూడా ఆమెని ట్రోల్ చేస్తారా..? ఇంత చెత్త రుమరా..? సిగ్గు లేదా అంటూ మండిపడుతున్నారు..!