సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయం ఓ రేంజ్ లో వైరల్ అయిపోతుంది . అది స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయం అయితే ఇక చెప్పనవసరం లేదు. ఆల్మోస్ట్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో ఆ విషయం వైరల్ అయిపోతూ ఉంటుంది . తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . అది కూడా ఇద్దరు పాన్ ఇండియా హీరోలకి సంబంధించిన వార్త కావడంతో జెట్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరు అంటే మాత్రం కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు ప్రభాస్. బాహుబలి తర్వాత ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాశాడు .
ఇప్పటికి ప్రభాస్ సినిమాలు కొన్ని ఫ్లాప్ అవుతున్న కూడా మేకర్స్ ఆయనకు 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేస్తున్నారు అంటే ఆయన రేంజ్ ఆఫ్ ఫాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు . అయితే ఇప్పుడు ఆ విషయంలో ప్రభాస్ ని బీట్ చేసేసాడు రామ్ చరణ్ అంటూ న్యూస్ వైరల్ గా మారింది . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ తన నెక్స్ట్ సినిమా కోసం ఏకంగా 137 కోట్లు ఛార్జ్ చేశాడట . ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఇంత హై రెమ్యూనరేషన్ అందుకుపోవడం గమనార్హం.
దీంతో చాలామంది రామ్ చరణ్ తీసుకున్న డెసిషన్ ని తెలుసుకొని షాక్ అయిపోతున్నారు . జనరల్ గా రాంచరణ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడు . మేకర్స్ ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు . కానీ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం మాత్రం చాలా చాలా రిస్క్ చేస్తున్నాడట . రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించడమే కాకుండా ఈ సినిమా కోసం చాలా చాలా స్థాయిలో కష్టపడి పోతున్నాడట . ఫస్ట్ టైం చరణ్ ఇంత రెమ్యూనరేషన్ కావాలి అంటూ డిమాండ్ చేశాడట .
దీంతో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు ప్రభాస్ ని బకరా చేయడానికి ఇలా హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడు అని జనాలు మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ చేస్తే ఇక ఈ మెగా ఫాన్స్ ని ఆపలేం రా బాబు అంటూ కొంతమంది జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు నిజంగానే రామ్ చరణ్ 137 కోట్లు చార్జ్ చేస్తున్నాడా ..? లేదా ఇది కేవలం పుకారేనా..? తెలియాలి అంటే బుచ్చిబాబు సనా టీమ్ స్పందించాల్సిందే..!