Moviesవార్నీ.. ఫోటోగ్రాఫర్ ని తారక్ అరిచింది అందుకా..? ఏదేదో సృష్టించారు కదరా...

వార్నీ.. ఫోటోగ్రాఫర్ ని తారక్ అరిచింది అందుకా..? ఏదేదో సృష్టించారు కదరా బాబు..!

గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో తారక్ ఫోటోగ్రాఫర్ ని అరవడం మనం క్లియర్ గా చూడొచ్చు . అయితే చాలామంది తారక్ కి కోపం ఎక్కువ అని ..దూకుడు ఎక్కువ అని తగ్గించుకోవాలి అని ..నోటికొచ్చిన కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే తారక్ అసలు ఆ ఫోటోగ్రాఫర్ ని ఎందుకు అరిచాడు..? అన్నదానిపై క్లారిటీ వచ్చింది .

తాజాగా ముంబైకి వెళ్ళాడు ఎన్టీఆర్ . అక్కడ హోటల్లోకి ఎన్టీఆర్ వెళుతూ ఉండగా అక్కడి కెమెరామెన్ షూట్ చేస్తూ వచ్చారు. దీంతో ఎన్టీఆర్ అసహనంగా ఫీల్ అయి వారి మీద కాస్త ఫైర్ అయ్యారు . “కీప్ ఇట్ బ్యాక్” అంటూ గట్టిగా అరిచారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . అయితే చాలామంది ఎన్టీఆర్ తన లుక్కు రివీల్ అయిపోతుంది అన్న భయంతోనే ఈ విధంగా అరిచాడు అని ..ఒక యాక్టర్ కి అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ అయిన యాక్టర్ కి ఇంత కోపం ఉండడం అస్సలు మంచిది కాదు అని.. ఆ దూకుడు తగ్గించుకోవాలి అని ఉచిత సలహాలు ఇచ్చారు .

అయితే ఎన్టీఆర్ అరిచింది ఆయన లుక్కు రివిల్ అయిపోతుంది అని కాదు.. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఫోన్లో పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుతారు. ఆ విషయాలు మీడియాలో బయటకు రావడం ఎవరు కూడా ఇష్టపడరు. తన పర్సనల్ థింగ్స్ తన వరకే ఉండాలి ..అది ఎవరైనా కోరుకుంటారు. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అట్లా రికార్డు చేయడం వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ..ప్రైవసీ కి భంగం కలిగించినట్లే .. ఆ కారణంగానే కీప్ ఇట్ బ్యాక్ అన్నారు అట. అయితే కొంతమంది మాత్రం తారక్ పై విచ్చలవిడిగా నోరు వేసుకొని కామెంట్స్ చేయడం ఏమాత్రం బాగోలేదు అంటూ నందమూరి ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news