జనరల్ గా ఎంత పెద్ద ఫ్రెండ్స్ అయినా సరే మాటా మాట అనుకుంటూ ఉంటారు. పోట్లాడుకుంటూ ఉంటారు. మళ్లి కలిసిపోతూ ఉంటారు . ఫ్రెండ్షిప్ అంటేనే అంతా.. ఆ కిక్ ఆ మజా గొడవ పడితేనే వస్తుంది..రారా-పోరా-ఏరా-ఓరేయ్ అని పిలుచుకున్న పిలుపులు మరిచిపోతామా..? అయితే ఇండస్ట్రీలో అంత చనువుగా ఉండే హీరోలు కూడా ఒక విషయం కారణంగా దాదాపు 6 నెలలు మాట్లాడుకోకుండా ఉన్నారట . ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ హీరోలు మరెవరో కాదు పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ – తారక్.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు . పాన్ ఇండియా లెవెల్లో బాగా సినిమాలను ఓకే చేస్తూ క్రేజ్ దక్కించుకున్నారు . వీళ్లిద్దరూ చాలా చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ . అది అందరికీ తెలిసిందే . అయితే ఇండస్ట్రీలో ఉండే ఓ డైరెక్టర్ కారణంగా వీళ్ళ మధ్య వచ్చిన మిస్ అండర్ స్టాండింగ్స్ వల్ల దాదాపు 6 నెలల పాటు వీళ్ళు మాట్లాడుకోలేదట . ఆ తర్వాత ఒకానొక ఈవెంట్లో అనుకోకుండా ఎదురుపడి ఆ ఇష్యూను క్లారిటీగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకున్నారట . ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది .
మరొకసారి వీళ్ళకి సంబంధించిన ఇదే విషయాన్ని జనాలు ట్రెండ్ చేస్తున్నారు. ప్రెసెంట్ తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తూ ఉండగా ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ముందుకెళ్తున్నాడు . ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు కూడా ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు పుచ్చుకుంటూ ఉండటం గమనార్హం..!!