ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే మనం విజయ్ దేవరకొండ పేరుని ఎక్కువగా వింటూ వస్తున్నాము. సోషల్ మీడియాలో ఆయనను హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేస్తున్నారు ఆకతాయిలు. కాగా రీసెంట్గా ఆయన నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ గా మారింది . ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మనం సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్కి గురవడం చూశాము.
అయితే తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా అయినా పర్వాలేదు ఆయనకు అద్దిరిపోయే ఆఫర్ వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు విజయ్ దేవరకొండ అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు విజయ్ దేవరకొండ – విజయ్ తిన్నూరి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో చాలా స్టైలిష్ గా ట్రెండీగా కనిపించబోతున్నాడట .
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. వాళ్ళల్లో మలయాళీ సెన్సేషనల్ బ్యూటీ కూడా ఉండడం విశేషం. ప్రేమలు చిత్రంతో ఆడియన్స్ కు దగ్గర అయిన మమిత బైజు ఈ సినిమాలో నటిస్తుందట . అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన భాగ్యశ్రీ బోర్సే అనే హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే న్యూస్ ని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. చూద్దాం మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడో..?