Moviesబాలయ్య 109 గ్లింప్స్ లో ఇది గమనించారా.. భలే పాయింట్ లీక్...

బాలయ్య 109 గ్లింప్స్ లో ఇది గమనించారా.. భలే పాయింట్ లీక్ చేసేసావు కదరా బాబీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య.. బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి సంబంధించిన గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయింది . మహాశివరాత్రి సందర్భంగా నిన్న సాయంత్రం ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్ . మొదటి నుంచి ఈ సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అదేవిధంగా అభిమానుల ఆకలి తీర్చబోతుంది ఈ సినిమా అంటూ చిన్న గ్లిమొస్ తోనే చెప్పేసాడు బాబీ.

ఈ సినిమాల్లో బాలయ్య చాలా డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. రిలీజ్ అయిన గ్లిమొస్ అభిమానులను ఆకట్టుకుంటుంది . గ్లింప్స్ స్టార్ట్ అవ్వగానే మనకి ఎన్బికె అంటూ ఓ అగ్ని లావాలా చూపిస్తారు. చాలా చాలా డిఫరెంట్ షేడ్స్ లో చూపించాడు బాబీ. అంతేకాదు విలన్ వచ్చి..” ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా ..?”అని చెప్పగానే ..

“సింహం నక్కల మీదకు దూకుతూ ఉంటే అది వార్ కాదురా లఫూట్.. హంటింగ్ అంటూ చాలా గంభీరమైన గొంతుతో చెప్తాడు”.. బాలయ్య చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లోకి వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో కీ పాయింట్ ని లీక్ చేసేసాడు బాబి అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. బాలయ్య విలన్స్ తో ఫైటింగ్ స్టార్ట్ చేసేముందు మందు బాటిల్ ను ఫుల్లుగా లేపేస్తాడు .. అంటే ఈ సినిమాల్లో బాలయ్య బాబుకు మందు అలవాటు ఉన్న మనిషిగా చూపించబోతున్నాడు బాబి అంటూ నందమూరి అభిమానులు గెస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ గ్లిమొస్ బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news