సిమ్రాన్ .. ఈ పేరు చెప్తే ఇప్పటి జనరేషన్ కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. ఒకప్పటి జనరేషన్ కి మాత్రం ఈ పేరు చెప్తే ఓ రేంజ్ లో పూనకాలు వచ్చేస్తాయ్. సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటించి మెప్పించిన సిమ్రాన్ ఆల్మోస్ట్ అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది . తమిళంలో తనదైన స్టైల్ లో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకుంది . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో సిమ్రాన్ అంటే అప్పుడు స్టార్ హీరోలు సైతం కాచుకొని కూర్చుండేవారు.
బడా బడా హీరోలు కూడా సిమ్రాన్ కాల్ షిట్స్ కోసం వెయిట్ చేసారు అంటే అమ్మడు హవా ఎంతలా ఉండిందో అర్థం చేసుకోవచ్చు . ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ముందుకు వెళుతున్న టైం లోనే సిమ్రాన్ తెలుగు హీరోతో డీప్ గా ప్రేమాయణంలో మునిగి తేలింది అంటూ వార్తలు వినిపించాయి . అంతేకాదు ఆ హీరో కూడా ఇష్టపడ్డారట . ఇద్దరు ప్రేమించుకున్నారట . పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అట . కానీ ఆ హీరో తండ్రి సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ని నమ్మకూడదు.. వాళ్ళని పెళ్లి చేసుకుంటే కుటుంబంలో గొడవలు కన్ఫామ్ ..వాళ్ళు విడాకులు ఇచ్చి వెళ్లిపోతారు అంటూ చెప్పి ఆ హీరో మైండ్ మార్చేశారట .
మొదటి నుంచి తండ్రి అంటే భక్తి గల ఆ హీరో ప్రేమించిన అమ్మాయిని సైతం వదులుకున్నారు. ఆ కోపంతో సిమ్రాన్ తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఒకవేళ సిమ్రాన్ ఆ తప్పు చేయకుండా ఉంటే ఇప్పటికి సీనియర్ పాత్రలను పోషిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ముందుకు వెళ్ళుండేది. జస్ట్ మిస్ తెలుగింటి కోడలు అవ్వాల్సిన సిమ్రాన్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది..!!