Moviesఆ పని చేయడానికి బాలయ్య రెడీ.. మరి పవన్ ఒప్పుకుంటాడా..? ఫ్యాన్స్...

ఆ పని చేయడానికి బాలయ్య రెడీ.. మరి పవన్ ఒప్పుకుంటాడా..? ఫ్యాన్స్ ఓపెన్ సవాల్..!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వారసుల ఎంట్రీ మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒకప్పటి స్టార్ హీరోస్ అంతా ఇప్పుడు సీనియర్స్ అయిపోయారు . యంగ్ జనరేషన్ ని ఎంకరేజ్ చేస్తున్నారు యువత. ఈ క్రమంలోనే త్వరలోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . ఈ విషయాన్ని బాలయ్య కూడా కన్ఫామ్ చేసేసాడు . ఇప్పటికే బాలయ్య కొడుకు తన బాడీ లుక్స్ ని కూడా మార్చేశాడు . స్టార్ హీరోకి మించిపోయే రేంజ్ లో కటౌట్ రెడీ చేసుకున్నాడు.

అంతేకాదు త్వరలోనే బడా దర్శకుడు దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఫాన్స్ సరికొత్త న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . మనకు తెలిసిందే బాలయ్య పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్ . సమయం వచ్చినప్పుడల్లా ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. కాగా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే బాగుంటుంది అని సినిమా ఇండస్ట్రీలో అది ఎప్పటికీ ఓ మైలురాయిగా మిగిలిపోతుంది అని ..ఎవ్వరూ ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేయలేరు అని చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కన్ఫామ్ చేసేసాడు బాలయ్య . అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన కొడుకు ఎంట్రీ గురించి ఎక్కడ మాట్లాడలేదు . అసలు రేణు దేశాయ్ ఆకీరా ని ఇండస్ట్రీలోకి హీరోగా దింపుతుంది అన్న ఆశలు కూడా లేవు. దీంతో పలువురు జనాలు ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. బాలయ్య ఒప్పుకున్న రేణు దేశాయ్ ఒప్పుకోవాలి గా అంటూ మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాట్లాడితే అకిరా ఏమన్నా ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏమో ..? అంటూ చర్చించుకుంటున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news