Moviesమరో తెలుగు సినిమాకి కమిట్ అయిన రణబీర్ కపూర్. డైరెక్టర్ ఎవరో...

మరో తెలుగు సినిమాకి కమిట్ అయిన రణబీర్ కపూర్. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిపోతాయ్.. ఇది యానిమల్ కి అమ్మ మొగుడే..!!

రన్బీర్ కపూర్ .. నిన్న మొదటి వరకు ఈ పేరు కేవలం బాలీవుడ్ జనాలు మాత్రమే ఎక్కువగా పలికేవారు . అయితే ఎప్పుడైతే యానిమల్ సినిమా రిలీజ్ అయిందో అప్పటినుంచి తెలుగులో కూడా ఈ పేరు మారు మ్రోగిపోతుంది. బాలీవుడ్ లో బడా హీరో అయినప్పటికీ తెలుగులో పెద్దగా గుర్తింపు సంపాదించుకొని రన్బీర్ కపూర్ .. కేవలం ఒక్కటంటే ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టి సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసాడు .

సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఏకంగా 900 కోట్లు క్రాస్ చేసి సంచలన రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా విజయం తర్వాత రన్బీర్ కపూర్ స్థానం మరింత హై గా మారిపోయింది . యానిమల్ సినిమా తర్వాత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ కి కమిట్ అయినట్లు తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు సుకుమార్ .

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న సుకుమార్ తో ఒక క్రేజీ ప్రాజెక్టుకి కమిట్ అయ్యాడట రన్బీర్ కపూర్ . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . పుష్ప సినిమా ద్వారా బాలీవుడ్ లో కూడా క్రేజ్ దక్కించుకున్నాడు సుకుమార్ . ఆయన తెరకెక్కించే సినిమాలు బాగుంటాయి అన్న పేరు కూడా వచ్చింది . ఈ క్రమంలోనే యానిమల్ తర్వాత అలాంటి హిట్ పడాలి అంటే కచ్చితంగా ఆ స్థాయి డైరెక్టర్ ఉంటేనే కరెక్ట్ అనుకున్నారని ..సుకుమార్ కి కమిట్ అయ్యాడట. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుందట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news