సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగార్జున అక్కినేని అమల జంట ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మేడ్ ఫర్ ఈచ్ అదర్ . రెండో పెళ్లి చేసుకున్న సరే చూడ చక్కగా చాలా అన్యోన్యంగా పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన ఒక వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు .
అక్కినేని నాగార్జున అంటే అభిమానులకి ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . నాగార్జున ప్రతి విషయంలోనూ చాలా క్లారిటీగా ఉంటాడు.. అన్న నమ్మకం అందరికీ ఉంటుంది . అయితే ఇప్పటికి కూడా అక్కినేని నాగార్జున అమలల మధ్య ఓ విషయంలో అండర్స్టాండింగ్ అస్సలు ఉండదట. పెళ్లయి ఇన్నేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అక్కినేని నాగార్జున మనసును అమల ..అమల మనసును నాగార్జున అర్థం చేసుకోలేరట . అది కూడా కేవలం ఒకే ఒక విషయం కారణంగా ..
అదే మనీ.. అక్కినేని నాగార్జున విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేస్తాడట. ఫ్రెండ్స్ కి ఎక్కువగా డబ్బులు దార పోస్తారట . కానీ అక్కినేని అమల మాత్రం ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ వీళ్లిద్దరి మధ్య ఇప్పటికీ డబ్బులు కారణంగా అరాకొరా గొడవలు జరుగుతూనే ఉంటాయట . ఏ బిజినెస్ లో పెట్టాలి ఏ రంగంలో ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనేది నాగార్జున డిసైడ్ చేస్తారట. కానీ అమల మాత్రం ఆ విషయంలో ఎప్పుడు నాగార్జునకి అడ్డు చెబుతూనే ఉంటారట. ఉన్న బిజినెస్ చాలు కొత్త బిజినెస్ అవసరం లేదు అంటూ ఎప్పుడు చెప్పుకొస్తూనే ఉంటారట . ప్రతి విషయంలో చాలా అన్యోన్యంగా ఉండే వీళ్ళు బిజినెస్ డబ్బు పరంగా మాత్రం అస్సలు తగ్గరు ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్స్ ..ఆ విషయంలో వీళ్ళకి సఖ్యత లేదు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!!