Moviesరివ్యూ: కెప్టెన్ మిల్ల‌ర్ ... ధ‌నుష్ మ్యాజిక్ ఏమైంది..

రివ్యూ: కెప్టెన్ మిల్ల‌ర్ … ధ‌నుష్ మ్యాజిక్ ఏమైంది..

టైటిల్‌: కెప్టెన్ మిల్ల‌ర్‌
నటీనటులు: ధనుష్, శివ రాజ్‌కుమార్, ప్రియాంక అరుల్ మోహన్, సందీప్ కిషన్, నివేదిత సతీష్, ఎలాంగో కుమారవేల్, కాళి వెంకట్, బోస్ వెంకట్ తదితరులు
ఎడిట‌ర్‌: నాగూరన్ రామచంద్రన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని
మ్యూజిక్‌: G. V. ప్రకాష్ కుమార్
నిర్మాతలు: సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్
దర్శక‌త్వం : అరుణ్ మతీశ్వరన్
రిలీజ్ డేట్‌: 26 జ‌న‌వ‌రి, 2024

త‌మిళ క్రేజీ హీరో ధ‌నుష్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు అరుణ్ మతీశ్వరన్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా కెప్టెన్ మిల్ల‌ర్‌. ఈ రోజు తెలుగులో రిలీజ్ అయ్యింది. త‌మిళంలో రు. 100 కోట్ల సినిమాగా నిలిచిన కెప్టెన్ మిల్ల‌ర్ ఈ రోజు తెలుగులో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :
భారతదేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న టైంలో ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. అగ్ని (ధ‌నుష్‌) తక్కువ కులానికి చెందిన వారు. ఇత‌డు ఉండే ఊళ్లో ఓ పెద్ద గుడి ఉంటుంది. అయితే త‌క్కువ కులానికి చెందిన అగ్ని పూర్వికులే ఆ గుడిని నిర్మిస్తారు. అయితే ఆ కులానికి చెందిన వారిని కొంద‌రు ఆ గుళ్లోకి రానివ్వ‌రు. ఈ గ్రామాన్ని త‌మ దేవుడు ఘోర హరుడు కాపాడుతుంటాడని అక్కడి అగ్ని కులానికి చెందిన వారు న‌మ్ముతుంటారు. అస‌లు ఆ ఘోర హ‌రుడు ఎవ‌రు ? అగ్నికి, ఆ ఘోర‌హ‌రుడికి ఉన్న లింక్ ఏంటి ? ఈ క్ర‌మంలో జ‌రిగిన ప‌రిణామాల‌తో అగ్ని, బ్రిటీష్ వారిపై ఎలాంటి పోరాటం చేశాడు ? ఈ క‌థ‌లో శివన్న (శివ‌రాజ్‌కుమార్‌), రఫీ (సందీప్ కిషన్)ల పాత్రలు ఏంటి ? అగ్ని కెప్టెన్ మిల్ల‌ర్‌గా ఎలా మారాడు అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

విశ్లేష‌ణ :
ఈ సినిమాలో ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్‌గా ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోష‌న్‌తో ఆక‌ట్టుకున్నాడు. త‌న పాత్ర ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్టుగా వేరియేష‌న్స్ బాగా చూపించాడు. గెస్టు పాత్ర‌ల్లో సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ పాత్ర‌కు న్యాయం చేసింది. కీల‌క పాత్ర‌లో నివేదిత సతీష్ మెప్పించ‌గా.. ఇత‌ర న‌టీన‌టులు పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఆ రోజుల్లో బ్రిటీష్ పాల‌న ఎలా సాగింది ? బ్రిటీష్ వారు త‌క్కువ జాతిని ఎలా ? అణిచి వేశారు ? అన్న‌ది సినిమాలో బాగా చూపించారు. ఆధిపత్యం నుంచి పుట్టే తిరుగుబాటు ఎంతో బలంగా ఉంటుంద‌న్న‌ది సినిమాలో బాగా చూపించారు.

కులం పేరుతో అంట‌రానివారంటూ బ‌డుగు అణ‌గారిని వ‌ర్గాల‌ను ధైర్యంగా గుడిలోకి కాలుపెట్టేలా చేయ‌డ‌మే ఈ సినిమా ప్ర‌ధాన పాయింట్‌. ఈ పాయింట్ చుట్టూనే క‌థ అంతా న‌డుస్తుంది. వాస్త‌వానికి ఇంత గొప్ప లైన్ ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల్లోకి హ‌త్తుకుపోవాలి. కానీ రాసుకున్న స్క్రీన్ ప్లేలో ఇంట్ర‌స్టింగ్ మిస్ కావ‌డంతో మ‌రి అంత హ‌త్తుకున్న‌ట్టుగా ఉండ‌దు. టెక్నిక‌ల్‌గా అరుణ్ మతీశ్వరన్ దర్శకుడిగా ఈ సినిమాకి న్యాయం చేశాడు. అయితే ర‌చ‌యిత‌గా ఫెయిల్ అయ్యాడు. క‌థ‌నం మీద ఇంకాస్త శ్ర‌ద్ధ తీసుకోవాల్సింది. జీవీ ప్ర‌కాష్‌కుమార్ సంగీతం బాగుంది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఎడిటింగ్‌లో సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ట్రిమ్ చేయాల్సి ఉంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ఫైన‌ల్‌గా…
ధ‌నుష్ ఫ్యాన్స్‌తో పాటు యాక్ష‌న్ ప్రియుల‌ను మెప్పించే కెప్టెన్ మిల్ల‌ర్

కెప్టెన్ మిల్ల‌ర్ రేటింగ్ : 2.5 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news