ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అఫ్ కోర్స్ నిన్న మొన్నటి వరకు కూడా ప్రశాంత్ వర్మ అంటే జనాలు గుర్తుపట్టే వాళ్ళు . కానీ ఇప్పుడు ప్రశాంత్ వర్మ అంటే ఓ స్టార్ డైరెక్టర్ కి ఇచ్చిన రెస్పెక్ట్ ఇస్తున్నారు. ప్రశాంత్ నీల్ – రాజమౌళి – సుకుమార్ లాంటి డైరెక్టర్లకు ఇచ్చిన రెస్పెక్ట్ ప్రశాంత్ వర్మకి ఇస్తున్నారు. దానంతటికీ కారణం హనుమాన్ సినిమా .
ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ దక్కించేసుకున్నాడు ప్రశాంత్ వర్మ . కాగా ప్రశాంత్ వర్మ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు నెట్టింట మరోసారి వైరల్ గా మారాయి. ఆయన కథ చెప్పడానికి ఓ ప్రొడ్యూసర్ ఇంటికి వెళితే ఆయన వాచ్ మ్యాన్ కి కథ వినిపించమని చెప్పారని.. ఆ టైంలో బాగా హర్ట్ అయ్యానని .. అంతేకాకుండా దాదాపు 400 కథలను నేను రాసుకున్నానని..
ప్రతి కథను వివరించే మూమెంట్లో నాకు అవమానమే ఎదురయిందని .. కొందరు మందు సిట్టింగ్ టైంలో కథ వింటాను ఫోన్ చేసి రమ్మంటారని ..చాలా చాలా బాధేసింది అని చెప్పుకొచ్చాడు . అంతేకాదు నా కెరియర్ లో ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయని .. అవన్నీ తట్టుకొని మరి నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!