సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉండటం మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ విషయాలు ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. సినిమా రంగంలో అవకాశాల కోసం ఎదురు చూసే వారు చాలామంది ఉంటారు . ఇండస్ట్రీలోకి రావాలి అని హీరోయిన్గా సక్సెస్ అవ్వాలి అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉంటారు . అందరికీ డైరెక్టుగా హీరోయిన్ ఛాన్సులు రావు… కొందరు వేరే పద్ధతి ద్వారా ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు అలాంటి వారే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ముద్దుగుమ్మలు . టీవీ యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమా హీరోయిన్గా మారిన అందాల ముద్దుగుమ్మలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం…!!
రష్మీ : 2007లో వనిత టీవీలో యువ అనే ప్రోగ్రాం తో యాంకర్ కెరియర్ స్టార్ట్ చేసింది . ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు కోసం ట్రై చేసింది . ఒకపక్క సినిమాలో హీరోయిన్గా చేస్తూనే మరో పక్క బుల్లితెరపై తన సత్తా కొనసాగిస్తుంది.
శ్రీముఖి: 2015లో చంద్రిక సినిమాలో హీరోయిన్గా చేసింది . అంతకు ముందు ఆమె యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టింది . ప్రెసెంట్ బుల్లితెరపై ఆమె ఓ పెద్ద టాప్ యాంకర్. ఒక్కొక్క కాల్ షీట్ కు 1,50,000 తీసుకుంటుంది .
రెజీనా: టీవీ యాంకర్ గానే ఈమె ముందు తన కెరియర్ స్టార్ట్ చేసింది . ఒక క్విజ్ ప్రోగ్రాంకు యాంకర్ గా పనిచేసి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది .
స్వాతి: కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత పలు సినిమాలతో ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అయింది.
నిహారిక : ఢీ ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్గా వచ్చింది . ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ చెప్పింది . ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ గా ట్రై చేస్తుంది.
అనసూయ: యాంకర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . జూనియర్ ఎన్టీఆర్ నటించిన “నాగ” ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రంగస్థలం సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇలా యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్లుగా మారి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఈ అందాల ముద్దుగుమ్మలు..!!