సలార్.. సలార్.. సలార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో ..వెబ్ మీడియాలో ..సోషల్ మీడియాలో.. స్కూల్ కి వెళ్లే పిల్లలు.. కాలేజీలో చదువుకునే యంగ్ స్టార్స్ ఆఫీస్ కి వెళ్లే జనాలు .. ఇప్పుడు ఎవరు చూసినా సరే ఇదే పేరును జపిస్తున్నారు . సలార్ సినిమా బాగుంది అంట కదా..? సినిమాకి వెళ్లాలి ..సలార్ సినిమా చాలా చాలా బాగుంది అంటున్నారు నిజమేనా..? సలార్ సినిమాలో ప్రభాస్ కుమ్మి పడేసాడంటగా .. సలార్ సినిమా బాహుబలికి అమ్మ మొగుడులా ఉందంటగా ..ఇలాంటి కామెంట్స్ తోనే రచ్చ రంబోలా చేసేస్తున్నారు .
నిజానికి ఇదంతా నిజమే . ప్రభాస్ సలార్ సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు అరాచకానికి అమ్మ మొగుడిలా ఉంది. ఎలా అంటే ప్రభాస్ ని బాహుబలి లో చూసిన తర్వాత ఈ సినిమాని ఆయనకు ది బెస్ట్ అనుకున్నారు. కానీ 100 బాహుబలిలకు మించిన రేంజ్ లో ప్రభాస్ ని చూపించాడు ప్రశాంత్ నీల్ . అలా ఇలా కాదు దుమ్ము దులిపేశాడు . ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రభాస్ కి ఈ సినిమా మరో పునర్జన్మను ఇచ్చిందని చెప్పాలి .
అయితే అంతలా ఈ సినిమాలో ఆయన సీన్స్ ఎలివేట్ కావడానికి కారణం ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధని అంటున్నారు మేకర్స్ . అందరు లాగా స్టార్ హీరోస్ నేను ఒకే టేక్ లో కంప్లీట్ చేయాలి అని కాకుండా ప్రతి సీన్ ని మూడు నాలుగు సార్లు టేక్స్ తీసుకొని ఆ సీన్ ఏది బాగా వస్తే దాని ఫైనలైజ్ చేసుకున్నారట . అంతేకాదు కేజీఎఫ్ సిరీస్ కోసం ప్రశాంత్ దగ్గర స్పెషల్ డైట్ ఫాలో అయ్యేలా చేశారట. ఒకటి కాదు రెండు కాదు సినిమా చేసినన్ని సంవత్సరాలు అదే డైట్ ఫాలో అవ్వాలి అంటూ కండిషన్ పెట్టారట .
అయితే ప్రభాస్ కూడా ఇదే కండిషన్ల ను ఒప్పుకొని మరి కొన్ని సంవత్సరాలపాటు ఆయనకి ఇష్టమైన ఐటమ్స్ ను వదులుకొని మరి సినిమా కోసం సపరేట్ ఫాలో అయ్యారట . చీటింగ్ మీల్ అనేదే లేకుండా ప్రభాస్ తన బాడీ పై కాన్సన్ట్రేషన్ చేశారని అందుకే ప్రభాస్ అంత కండలు తిరిగిన వీరుడిగా మనకి సినిమాలో కనిపిస్తాడు అని న్యూస్ ట్రెండ్ అవుతుంది..!!