Moviesమ‌హేష్‌బాబు మీద ప్రేమ‌తో శ్రీలీల ఏం చేసిందో చూడండి...!

మ‌హేష్‌బాబు మీద ప్రేమ‌తో శ్రీలీల ఏం చేసిందో చూడండి…!

టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ బ్యూటీ శ్రీ‌లీల హవా ఎలా నడుస్తుందో చూస్తూనే ఉన్నాం. గత నాలుగు నెలల లో నాలుగు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన శ్రీలీల సగుటన నెలకు ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. ఇక వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీలీల నటించిన గత నాలుగు సినిమాలలో ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, స్కంధ‌ సినిమాలు అంచనాలు అందుకోలేదు. బాలయ్య‌తో చేసిన భగవంత్‌ కేసరి మాత్రం సూపర్ డూపర్ హిట్. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా హిట్ అయితే శ్రీలీలకు మరో రెండేళ్ల పాటు టాలీవుడ్ లో ఎదురే ఉండదు. ఆమెకు సినిమాలు అంటే ఎంత ఇష్టమో, చదువు అంటే అంత ప్రాణం.

మహేష్ తో గుంటూరు కారం సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు కూడా పక్క ప్రణాళిక ప్రకారం ఆమె డేట్లు ఇచ్చింది. డిసెంబర్ 3వ‌ వారంలో ఆమెకు ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షలు ఉన్నాయి. అందుకే ఆ డేట్లకు ముందుగానే అన్ని డేట్లు గుంటూరు కారంకు కేటాయించింది. ఈ నెల 19 నుంచి 24 వరకు ముంబైలో పరీక్షలు రాయాల్సి ఉంది. అక్కడ పరీక్షలు రాసేందుకు వెళ్ళింది కూడా. కానీ మహేష్ గుంటూరు కారం సినిమా యూనిట్ గట్టిగా రిక్వెస్ట్ చేయడంతో వెనకు వచ్చేసింది. ఆమె రాయాల్సిన పరీక్షలు.. సప్లిమెంటరీలో రాయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు శ్రీలీలను ఒప్పించడంలో గుంటూరు కారం యూనిట్ సక్సెస్ అయిందని చెప్పాలి.

మూడు నెలల తర్వాత లేదా ఆరు నెలల తర్వాత సప్లిమెంటరీలో ఆమె చివరి సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం ఫైనల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. మహేష్ కూడా రెండు మూడు రోజులు పాటు ఈ సాంగ్ షూటింగ్‌లో పాల్గొంటారు. సితారా బ్యానర్ లో బ్యాక్ సినిమాలు ఓకే చేసింది శ్రీలీలా. అందువల్ల ఆ బ్యానర్ మీద తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రావాలంటే తన డేట్లు కీలకం అని ఆమె తన డాక్టర్ విద్య కోసం పరీక్షలు కూడా త్యాగం చేసింది. నిజంగా మహేష్ బాబు మీద కూడా శ్రీలీలకు ఎంతో ప్రేమ ఉందని ఆమె చేసిన త్యాగం చెప్పకనే చెబుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news