సాయి పల్లవి .. ఓ అందాల ముద్దుగుమ్మ.. చక్కటి రూపం ..అంతకుమించిన మంచి మనసు.. జనాలకి మంచి చేయాలి అనే పెద్ద హృదయం ఇలాంటి క్వాలిటీస్ అన్ని ఒక అమ్మాయిలు మనం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. అలాంటి ఓ అమ్మాయినే ఈ సాయి పల్లవి . పేరుకు మలయాళీ బ్యూటీనే అయిన తెలుగు సినిమాల ద్వారా పాపులారిటీ సంపాదించుకొని లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి ప్రెసెంట్ తండేల్ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటిస్తుంది .
కోలీవుడ్ లోనే రెండు సినిమాలకు సైన్ చేసింది . కాగా సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లో నటించదు.. వల్గర్ డైలాగ్స్ చెప్పదు అని అందరికీ తెలిసిందే. అలాంటి సాయి పల్లవి మాత్రం రొమాంటిక్స్ సీన్స్ సినిమాలో వస్తే చూస్తుందట . రొమాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు అలాంటి సీన్స్ కూడా చూడరు. కానీ సాయి పల్లవి అందుకు ప్రత్యేకం ఏదైనా సినిమాలో లిప్ లాక్ సీన్ వస్తే.. నిర్మొహమాటంగా చూస్తుందట .
అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ..కానీ ఆమె మాత్రం అలాంటి సీన్స్ లో నటించదట . సాయి పల్లవికి డైలీ ఏదో ఒక సినిమా చూసి పడుకునే అలవాటు కాలేజీ రోజుల్లో నుంచే వచ్చిందట. అలా ఇప్పటికి కూడా ఆమె ఏదో ఒక సినిమా చూస్తుందట . భాషలు ఏవైనా సరే ఆమె ఆ యాక్ట్రెస్ నటించే నటనను దగ్గరగా గమనిస్తుందట . పరిశీలించి తనలో కూడా ఆ మార్పులు చేసుకుంటూ ఉంటుందట..!!