Newsఆ రెండు చేయలేకపోవడం వల్లే.. వడ్డే నవీన్ స్టార్ హీరో కాలేకపోయాడా..?

ఆ రెండు చేయలేకపోవడం వల్లే.. వడ్డే నవీన్ స్టార్ హీరో కాలేకపోయాడా..?

ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ కొడుకుగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు వడ్డే నవీన్. ఇండస్ట్రీలో వారసత్వం అనేది కేవలం ఎంట్రీ వరకే పనికొస్తుంది. కానీ, ఆ తర్వాత ఆటుపోట్లని ఎదుర్కోవాల్సింది..ఎదురీదాల్సింది వారసులే. వడ్డే రమేశ్ కూడా కొడుకుని సొంత బ్యానర్ లో లాంచ్ చేశారు.

క్రాంతి ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా. కానీ, నిర్మాణ వ్యయం పెరగడం వల్ల రిలీజ్ కాలేదు. ఆ తర్వాత కోరుకున్న ప్రియుడు, పెళ్ళి లాంటి సినిమాలతో వరుసగా సూపర్ హిట్స్ అందుకొని బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సమయమలో నవీన్ వడ్డేకి పోటీ అంటే ఆ ఏజ్ గ్రూప్ లో వేణు తొట్టేంపూడి మాత్రమే ఉండేవారు. అప్పటికే హీరోగా ఎస్టాబ్లిష్ అయిన జగపతి బాబు, శ్రీకాంత్, జేడీ చక్రవర్తి కొంత పోటీని ఇచ్చారు.

ఇక చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి వారు ఎలాగూ ఉన్నారు. అయినా నవీన్ వడ్డేకి స్పేస్ బాగానే దొరికింది. మీడియం రేంజ్ హీరోగా మంచి సినిమాలు చేశారు..హిట్స్ అందుకున్నారు. మనసిచ్చిచూడు, స్నేహితులు, చాలాబావుంది, బాగున్నారా, మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలామంచిది లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.

ఇవి కాకుండా కొన్ని యావరేజ్ హిట్స్ కూడా ఉన్నాయి. అయితే, ఒకవైపు మిగతా హీరోల పోటీ కంటే నవీన్ వడ్డేకి డాన్స్ అండ్ ఫైట్స్ పెద్దగా వచ్చేవి కావు. మాస్ ఆడియన్స్ కి కావాల్సినవి అవే. దాంతో కొన్ని ఫ్లాపుల వల్ల ఇబ్బందులు ఎదుర్కున్నారు. అలా నెమ్మదిగా నవీన్ వడ్డే అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు అన్న పాత్రలు, మంచి క్యారెక్టర్స్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి ఎవరన్నా అప్రోచ్ అయితే నవీన్ వడ్డే ఒప్పుకుంటాడా లేదా చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news