టాలీవుడ్ లోకి కొత్తగా వచ్చే హీరోయిన్లకు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. ఒకసారి సక్సెస్ అయ్యాక కూడా స్టార్ హీరోలతో చాలా ఈజీగా అవకాశాలు వస్తున్నాయి. అందంతోపాటు.. కాస్త టాలెంట్ కూడా తోడైతే ఊహించని రేంజ్లో పారితోషకం అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. సినిమాల సెలెక్షన్ విషయంలో తొందర పడితే ఇమేజ్ ఒక్కోసారి డౌన్ అవుతోంది. ఉప్పెన సినిమాతో కృతిశెట్టి ఏ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చిందో చూసాం. ఆ తర్వాత ఆమె మంచి కథాబలం ఉన్న సినిమాలు కాకుండా ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా సినిమాలు చేయడంతో అవన్నీ డిజాస్టర్లు అయ్యాయి. దీంతో కృతి శెట్టి టాలీవుడ్ లో తక్కువ టైంలోనే ఐరన్ లెగ్గా మారిపోయింది.
ఇక క్రేజీ బ్యూటీ శ్రీలీలా వరుసగా పెళ్లి సందడి, ధమాకా సినిమాలతో రెండు సూపర్ డూపర్ హిట్లు కొట్టింది. ధమాకా అయితే ఏకంగా రూ.150 కోట్లు కొల్లగొట్టింది. ఈ దెబ్బతో ఆమెకు ఏకంగా బాలయ్య, పవన్, మహేష్ తో పాటు నితిన్ లాంటి కుర్ర హీరో సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయకుండా కథాబలం ఉన్న సినిమాలుకు ఒకే చెప్పకుండా రెమ్యూనరేషన్ పెంచేస్తూ ఇష్టం వచ్చినట్టుగా శ్రీలీల సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.
ఈ క్రమంలోనే ఆమెకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గత మూడు నెలల్లో ఆమెకు వరుసగా మూడు డిజాస్టర్లు వచ్చాయి. రామ్‌కు జోడిగా చేసిన స్కంద డిజాస్టర్. మెగా హీరో వైష్ణవ తేజ్ పక్కన నటించిన ఆది కేశవ అట్టర్ ప్లాప్. తాజాగా నితిన్ కు జోడిగా చేసిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలోను శ్రీలీల పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఈ సినిమాలో ఆమె కేవలం పాటలు, డ్యాన్సులకు మాత్రమే పరిమితం అయింది. బాలయ్యతో చేసిన భగవంత్ కేసరి సినిమా మాత్రమే ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఇక ఆమె ఆశలన్నీ సంక్రాంతికి మహేష్ బాబుకి జోడిగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా మీదే ఉన్నాయి. ఆ సినిమా హిట్ అయితే శ్రీలీలకు వెనక తిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు. అయితే శ్రీలీల ఇకపై అయినా కథలో పాత్రల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే ఆమె పూజా హెగ్డే, కృతి శెట్టిలా చాలా త్వరగానే టాలీవుడ్ నుంచి దుకాణం సర్దుకోవాలని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.