రీచా గంగోపాధ్యాయ ఈ బెంగాలీ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో దగ్గుబాటి హీరో రానా తొలి సినిమా లీడర్‌తో హీరోయిన్గా పరిచయం అయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమాలో రీచా పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుంది. కావాల్సిన అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్నా కూడా ఎందుకో రీచా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఎదగలేక పోయింది.
అలాగే స్టార్ హీరోల పక్కన ఆమె నటించలేదు. ఆమె సినిమాల్లోకి వచ్చాక చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ మిర్చి సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఆమెది సెకండ్ హీరోయిన్ పాత్ర. టాలీవుడ్‌లో రీచా ఎక్కువ సినిమాలలో నటించక పోవటానికి స్టార్ హీరోయిన్గా ఎదగపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్న పరిస్థితులేనని చెబుతూ ఉంటారు. ఆమెకు ఏదురైన కొన్ని దారుణమైన పరిస్థితులు తట్టుకోలేక ఆమెకు కొందరు స్టార్ హీరోల సినిమాలలో ఛాన్సులు వచ్చిన వారి కోరికలు, దర్శకుల కోరికలు తీర్చలేక ఆమె సినిమా రంగం మీద విరక్తితో చాలా త్వరగానే టాలీవుడ్‌కు గుడ్ బాయ్ చెప్పేసిందని ప్రచారం ఉంది.
ఈ విషయాన్ని ఒకటి, రెండు సందర్భాల్లో ఆమె పరోక్షంగా కూడా చెప్పింది. కొందరు స్టార్ హీరోల సినిమాలలో రీచాకు ఛాన్సులు ఇస్తాం అని చెప్పిన వారు పెట్టిన కండిషన్లు.. వారి కోరికలు తీర్చేందుకు ఆమె ఇష్టపడలేదని.. వ్యక్తిత్వం చంపుకుని సినిమాలు చేయటం నచ్చకే ఆమె చాలా త్వరగా టాలీవుడ్ ను వదిలి వెళ్లిందని అంటారు. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పిన రీచా అమెరికా వెళ్లి అక్కడ ఉన్నత విద్య అభ్యసించి అమెరికాకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.