టాలీవుడ్‌లో సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. ఒకప్పుడు మిడిల్ రేంజ్ హీరోగా ఉన్న శ్రీకాంత్‌కు సపరేట్‌గా అభిమానులు ఉండేవారు. లేడీ ఫ్యాన్స్ కూడా శ్రీకాంత్‌కు అప్పట్లో ఎక్కువే. విలన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత హీరో అయిన శ్రీకాంత్ అక్కడ నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఒకానొక టైంలో స్టార్ హీరోలకు పోటీ ఇస్తూ మరీ శ్రీకాంత్ వరుస పెట్టి హిట్లు కొట్టారు.
శ్రీకాంత్ సినిమా వస్తుందంటే చాలు ట్రేడ్ వర్గాల్లోనూ మినిమం గ్యారెంటీ ఉండేది. ఇక గత కొంత కాలంగా శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటిస్తున్నాడు. అలాగే విలన్ పాత్రలు చేస్తూ కూడా మెప్పిస్తున్నాడు. అఖండ సినిమాలో శ్రీకాంత్ చేసిన విలన్ పాత్రకు ఎంత పేరు వచ్చిందో చూశాం. తాజాగా శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి మహాత్మ సినిమాయే కారణం అని షాక్ ఇచ్చాడు.
ఆమె సినిమా హిట్ అయ్యాక తనకు వరుసగా అవకాశాలు వచ్చాయని… తాజ్‌మహాల్, పెళ్లిసందడి, ఆహ్వానం, వినోదం సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. వరుసగా అవకాశాలు వచ్చాయి. అప్పటి నుంచి ఒక సినిమా రిలీజ్ అయ్యిందంటే.. ఆ తర్వాత వరుసగా చేసేందుకు మూడు సినిమాలు లైన్లో ఉండేవని… అయితే తన వందో సినిమా మహాత్మ రిలీజ్ అయ్యాక… తన కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయ్యిందని చెప్పాడు.
మహాత్మ తర్వాత తాను 25 సినిమాలు చేసినా సరైన సక్సెస్‌లు రాలేదని… అది నా టైం బ్యాడ్ అని… కొత్తతరం హీరోలు రావడం కూడా తాను రేసులో వెనకపడడానికి కారణమై ఉంటుందని శ్రీకాంత్ తెలిపాడు.