Moviesశ్రీలీల వ‌రుస షాకుల నుంచి ఊపిరి పీల్చుకున్న ర‌ష్మిక‌... ఏం జ‌రిగిందంటే..!

శ్రీలీల వ‌రుస షాకుల నుంచి ఊపిరి పీల్చుకున్న ర‌ష్మిక‌… ఏం జ‌రిగిందంటే..!

టాలీవుడ్ లో నిన్న మొన్నటి వరకు క్రేజీ బ్యూటీ శ్రీలీల జోరుతో రష్మిక బేజారు అయ్యింది. వరుస‌పెట్టి శ్రీలీల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే మరో ఏడు ఎనిమిది కీలక ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. ఇటీవ‌లే భ‌గ‌వంత్ కేస‌రి, ఆదికేశ‌వ‌, ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమాల‌తో పాటు సంక్రాంతికి మ‌హేష్‌బాబు గుంటూరు కారం సినిమాల‌తో శ్రీలీల వ‌రుస‌గా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తోంది. పైగా ఆమె చేతిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు కొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

శ్రీలీల వ‌రుస క్రేజీ ప్రాజెక్టుల‌తో దూసుకు పోతుంటే ఆమె దెబ్బతో ఒక వెలుగు వెలిగిన రష్మిక రేసులో వెనకబడిపోయింది. అసలు పూజ హెగ్డే కు ఛాన్సులు ఇచ్చే వాళ్లే లేరు. తాజాగా రష్మిక నటించిన యానిమల్ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఐదు రోజుల్లో 500 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇదే ఊపులో రష్మికకు ఇప్పుడు ఏకంగా మూడు క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆమె బన్నీకి జోడిగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేస్తోంది.

ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయితే రష్మికను ఆపలేం. మరోవైపు రెయిన్‌బో సినిమా చేస్తోంది. అలాగే గీతా ఆర్ట్స్ మాస్ మూవీ మేకర్స్ కలిపి నిర్మిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఏదేమైనా శ్రీలీల పోటీ నుంచి ర‌ష్మిక కాస్త ఊపిరి పీల్చుకుని మ‌ళ్లీ బ‌లంగా రేసులోకి వ‌చ్చింది. ఇప్పుడు పుష్ప 2 హిట్ అయితే ర‌ష్మిక క్రేజ్‌కు కొంత కాలం తిరుగుఉండ‌దు. అయితే శ్రీలీల‌కు కూడా వ‌చ్చే యేడాది అన్నీ క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news