Moviesఅత్త‌తో లొల్లి... లావ‌ణ్య - వ‌రుణ్‌తేజ్ కూడా సామ్ - చైతు...

అత్త‌తో లొల్లి… లావ‌ణ్య – వ‌రుణ్‌తేజ్ కూడా సామ్ – చైతు బాట‌లో విడాకులేనా…!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కథానాయిక లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుని పట్టుమని రెండు నెల‌లు కూడా అవ్వ‌లేదు. ప్ర‌స్తుతం వీరు హానీమూన్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. వీరి అభిమానులు సోష‌ల్ మీడియాలో వీరు క‌ల‌కాలం క‌లిసి ఉండాల‌ని… పిల్లా పాప‌ల‌తో చ‌ల్ల‌గా ఉండాల‌ని ఆశీర్వ‌దిస్తుంటే ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మాత్రం వీరిద్ద‌రు భ‌విష్య‌త్తులో క‌లిసి ఉండే అవ‌కాశాలు ఏ మాత్రం లేవ‌ని.. చెపుతున్నారు.

వ‌రుణ్ – వేణు జాత‌కాలు క‌ల‌వ‌లేద‌ని.. వీరి జాత‌కాల్లో దోషాలు ఉన్నాయ‌ని వేణుస్వామి ఓ యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. వీరిద్ద‌రి జాత‌కాల్లో గురువు, శుక్రుడు నీచంగా ఉన్నారు.. నాకు తెలిసి వారిద్ద‌రు భ‌విష్య‌త్తులో క‌లిసి ఉండే ఛాన్సులు లేవు… ఈ ఇద్ద‌రి కుటుంబాల్లో ఓ ప్ర‌ముఖ‌మైన స్త్రీ వ‌ల్లే వీరు విడిపోతార‌ని ఆయ‌న చెప్పారు.

అయితే వేణుస్వామి చెప్పిన ఆ స్త్రీ వ‌రుణ్‌తేజ్ అమ్మ గారు అవుతారా.. అత్త‌గారితో పొస‌గ‌కే వీరి మ‌ధ్య గొడ‌వ‌లు వ‌స్తాయా ? అన్న చ‌ర్చ న‌డుస్తుండ‌గా… అటు వ‌రుణ్ చెల్లి నిహారిక ఇప్ప‌టికే విడాకులు తీసుకుంది.. లేదా ఆమె వల్ల ఈ దంప‌తుల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌స్తాయా ? అన్న మ‌రో చ‌ర్చ కూడా న‌డుస్తోంది. అయితే వేణుస్వామి వ్యాఖ్య‌ల‌పై మెగాభిమానులు మండిప‌డుతున్నారు.

ఆయ‌న రెండు ర‌కాలుగా మాట్లాడారు. మొదట లావణ్యకు కుజ దోషం ఉందని… తర్వాత లావణ్య జాతకంలో కుజ దోషంతో పాటు నాగ దోషం కూడా ఉన్న‌ట్టు చెప్పార‌ని… ఇక వ‌రుణ్ జాత‌కంలో గురువు, శుక్రుడు నీచంగా ఉన్నాడని రెండు ర‌కాలుగా చెప్ప‌డంతో ఆయ‌న మాట‌లు ప‌ట్టించుకోన‌క్క‌ర్లేదంటున్నారు. కొంద‌రు మాత్రం ఆయ‌న చెప్పిన‌వి అన్నీ జ‌రుగుతున్నాయ‌ని.. సామ్ , చైతు విడాకులే ఇందుకు పెద్ద ఉదాహ‌ర‌ణ అని… అందువ‌ల్ల వ‌రుణ్ – లావ‌ణ్య జాత‌కంలో ఏం జ‌రుగుతుందో అన్న టెన్ష‌న్ త‌ప్ప‌దంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news