Bollywood star heroine makes sensational comments on affair in industry. She told that every heroine in the industry are used by star heroes and still they are facing problem from them.
హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్లు నడుస్తుంటాయని, కెమెరాముందు తమకేమీ తెలియదన్నట్లుగా నటిస్తారే తప్ప.. వెనకాల మాత్రం బాగోతాలు నడుపుతారనే కామెంట్లు తరచూ వింటూ వుంటాం. వినడమేంది.. మనకూ అలాంటి ఆలోచనలే తడుతూవుంటాయి. కెమెరాముందే ఇంత ఓపెన్‌గా ఉంటున్నవాళ్లు.. ఖచ్చితంగా వెనకాల చేయాల్సిన పనులన్నీ చేసేస్తుంటారని చెప్పుకుంటుంటాం. ఇది నూటికి నూరు శాతం నిజమేనని బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కుండబద్ధలు కొట్టేసింది. ఏ విధంగా ప్రజలు నటీనటుల గురించి ఆలోచించుకుంటారో.. ఇండస్ట్రీలో అది నిజంగానే జరుగుతుందని ఆమె స్పష్టం చేసింది. అయితే.. హీరోలదే పెత్తనం ఎక్కువగా ఉంటుందని ఆ భామ వెల్లడించింది.
‘హీరోలందరూ సాఫ్ట్‌గా, కూల్‌గా ఉండడాన్ని చూసి వాళ్లు మంచోళ్లనుకుంటారేమో.. లోపల ఉండాల్సిన రాక్షసత్వం అలాగే ఉంటుంది’ అని ఆ బ్యూటీ చెప్పుకొచ్చింది. హీరోలంతా చెప్పేవి నీతులు, అనుసరించేది మాత్రం పాడు పద్ధతులు అంటూ పేర్కొంది. తనని చాలామంది స్టార్ హీరోలు వాడుకున్నారని చెబుతూనే.. దాదాపు బాలీవుడ్‌లోని ప్రతిఒక్కరూ అందరూ హీరోయిన్లను వాడుకున్నవారేనని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనతోపాటు చాలామంది భామలు టాప్ హీరోల కోరికలకు బలైన వారేనని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విధంగా ఈ అమ్మడు చేసిన కామెంట్ల మీద హీరోలందరూ అగ్గిమీద గుగ్గిలవుతున్నారు. బయటికి చెప్పుకోవడం లేదు కానీ.. లోపల మాత్రం తమ బండారం బయటపెట్టినందుకు ఆమె మీద ఆగ్రహం వెళ్లగక్కుతున్నారని సన్నిహిత వర్గాల పేర్కొంటున్నాయి.
అయినా.. సడెన్‌గా కంగనా రనౌత్ ఇలా కామెంట్స్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది ఇంతవరకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ హోదానే అనుభవిస్తోంది. పైగా.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ కూడా. అలాంటి ఈ అమ్మడు.. ఉన్నట్లుండి ఇలా ఎందుకు స్టేట్మెంట్స్ ఇచ్చిందని చెవులు కొరుక్కుంటున్నారు. బహుశా ఈ అమ్మడిని చాలామంది మోసం చేసి ఉంటారని, ఆ బాధని దిగమింగుకోలేకే ఇలా పబ్లిక్‌గా హీరోల బండారం బయటపెట్టేసి ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఏదిఏమైనా.. జనాలు నటీనటుల గురించి ఏమైతే అనుకుంటారో, అందులో చాలావరకు నిజముందని కంగనా ప్రూవ్ చేసేసింది.