‘ధృవ’ పదిరెట్లు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న అరవింద్ స్వామి

Aravind Swamy Gets Huge Remuneration For Dhruva Movie

Actor Aravind Swamy took 10 times remuneration for Dhruva movie than original version Thani Oruvan. Yes, this is true. When nobody not interested to this role, then movie unit has only one option that is Aravind. So, they asked him continously and finally he agreed to do this project for huge remuneration.

‘ధృవ’ సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికి ముందు.. యూనిట్ సభ్యులు విలన్‌ కోసం ఎంతోమందిని పరిశీలించింది. తెలుగులోనే ఓ స్టార్ హీరోని విలన్‌గా తీసుకోవాలని ఎంతో ప్రయత్నించింది. కానీ.. ఎవరూ ముందుకు రాలేదు. పోనీ.. ‘తని ఒరువన్’లో నటించిన అరవింద్ స్వామీనే తీసుకుందామంటే, ఆయన కూడా ఫస్ట్‌లో ససెమిరా అన్నాడు. దీంతో.. యూనిట్ డైలమాలో పడిపోయింది.

ఎవరిని తీసుకుంటే బాగుంటుందా? అని కొన్నాళ్లు బాగా ఆలోచించిన అనంతరం.. చివరికి అరవింద్ స్వామినే ఎంపిక చేయాలని నిర్ణయించింది. అంతే.. రంగంలోకి దిగి అతని వెంటపడింది. కావాలంటే రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామని చెప్పినా.. అరవింద్ ఒప్పుకోలేదు. ఫైనల్‌గా.. రూ.5 కోట్లు పారితోషికం ఇస్తామని చెప్పగా, నోరు మెదపకుండా అరవింద్ ఈ ప్రాజెక్ట్‌కి సైన్ చేసేశాడు. అవును.. మీరు చదువుతోంది నిజమే. ‘తని ఒరువన్’లో విలన్ పాత్ర పోషించడానికి కేవలం రూ.50 లక్షలే అందుకున్న అరవింద్.. తెలుగులో మాత్రం రూ.5 కోట్లు పుచ్చుకున్నాడు. అంటే.. పదిరెట్లు ఎక్కువ అన్నమాట. ఓ విలన్‌కి ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వడం ఇదే తొలిసారి.

మొదట్లో ఈ ప్రాజెక్ట్ చేయడానికి అరవింద్ ఎందుకు సుముఖత వ్యక్తం చేయలేదో తెలీదు కానీ.. రూ.5 కోట్లు ఖాతాలో వేయగానే గప్‌చుప్‌గా సినిమా చేసేశాడు. అంతేకాదు.. యూనిట్ ఎప్పుడు డేట్స్ అడిగిందో అప్పుడు ఇచ్చేశాడు. తమిళంలో విలన్‌గా అరవింద్ జీవించేశాడు కాబట్టి.. తెలుగులో అతను చేస్తేనే కరెక్ట్‌గా సూటవుతుందనే ఉద్దేశంతో, భారీ పారితోషికం ఇచ్చిమరీ నిర్మాతలు తీసుకున్నారు. ఏదైతేనేం.. ‘ధృవ’తో అరవింద్ పంట పండిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

Leave a comment