Moviesమెగాఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. రామ్ చరణ్ రికార్డ్‌ని బద్దలుకొట్టిన ‘చిన్నోడు’

మెగాఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. రామ్ చరణ్ రికార్డ్‌ని బద్దలుకొట్టిన ‘చిన్నోడు’

Young hero Nikhil Siddhartha has broke one of the Ram Charan’s record with his latest film Ekkadiki Pothavu Chinnavada, which is creating sensation at the worldwide boxoffice even in currency ban situation.

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తాజా చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలే క్రియేట్ చేస్తోంది. కరెన్సీ ఎఫెక్ట్ దేశాన్ని గడగడలాడిస్తుంటే.. దాంతో ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా ఈ చిన్నోడు బాక్సాఫీస్‌ని వణికిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా.. యూఎస్‌లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో, కలెక్షన్లు కొల్లగొడుతోంది. దాంతో.. రామ్ చరణ్ సాధించిన ఓ రికార్డ్ రికార్డ్ బద్దలైపోయింది.

‘మగధీర’ తర్వాత ‘బ్రూస్ లీ’ మూవీనే యూఎస్‌లో అత్యధిక వసూళ్లు సాధించింది. టోటల్ రన్‌లో ఆ మూవీ $650K వసూలు చేసినట్లు ట్రేడ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడా రికార్డ్‌ని తాజాగా నిఖిల్ దాటేశాడు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. గత నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన నిఖిల్ సినిమా ఇప్పటివరకు యూఎస్‌లో $665K కలెక్ట్ చేసింది. నిఖిల్ చిత్రానికి ఇప్పటికీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుతుండడంతో.. టోటల్ రన్‌లో ఇది $800K లేదా అంతకంటే ఎక్కువే కలెక్ట్ చేయవచ్చునని అంచనా వేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news