టాలీవుడ్లో ఛలో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో పాటు మన ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ జనాల దృష్టిలో అలా తళుక్కున మెరిసింది రష్మిక. ఆ తర్వాత వరుస హిట్లతో పాటు మహేష్‌బాబు, బన్నీ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన పాన్ ఇండియా రేంజ్ హిట్లు కొట్టేసింది.
ఇప్పుడు రష్మిక కాస్తా నేషనల్ క్రష్మిక అయిపోయింది. అసలు ఆమె డైరీ ఖాళీ లేదు. తాజాగా ఆమె రణబీర్ కపూర్‌తో కలిసి నటించిన యానిమల్ సినిమా దేశవ్యాప్తంగా నిన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు యునానమస్ హిట్ టాక్ వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రు. 116 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో రష్మిక నటనకు బాలీవుడ్ సినీ జనాలు కూడా ఫిదా అయిపోతున్నారు.
ఈ సినిమా కోసం రష్మిక భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ముందు వరకు రష్మిక రు. 3 – 4 కోట్ల రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకునేదట. అయితే ఇప్పుడు యానిమల్ సినిమాకు ఆమె ఏకంగా రు. 7 కోట్ల రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆమెపై పెట్టుకున్న ఆశలు నిజం చేస్తూ ఆమె సినిమాలో తన పాత్రలో విశ్వరూపం చూపించేసింది.
రు. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో నటించినందుకు గాను రష్మికకు కేవలం రు. 7 కోట్లే ఇచ్చారు. ఆమె నటనకు రు. 10 కోట్లు ఇచ్చినా తక్కువే అంటున్నారు కొందరు. నిజంగా అంతగా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా దెబ్బతో ఆమె బాలీవుడ్లో ఇక వరుసగా అవకాశాలు రానున్నాయి.